English | Telugu

శ్రీలీల కి అరుదైన వ్యాధి.. ఇంకా తగ్గలేదా?

తెలుగు సినీ పరిశ్రమలో ఏ విధంగా అయితే ఒక్కో హీరో కి ఒక్కో టైం వస్తుందో ఒక్కో హీరోయిన్ కి ఒక్కో టైం కూడా వస్తుంది. ఇప్పుడు ఆ టైం శ్రీ లీలకి వచ్చింది. రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నెంబర్ ఆఫ్ సినిమాలు అలాగే షూటింగ్ జరుపుకుంటున్ననెంబర్ ఆఫ్ సినిమాలే కాకుండా ఇంకో ఆరు సినిమా లు దాకా తన చేతులో ఉన్నాయి. దీన్ని బట్టి శ్రీ లీల బిజీ కేలండర్ ని అర్ధం చేసుకోవచ్చు తాజాగా ఈ అమ్మడి ఆరోగ్యం గురించి వచ్చిన ఒక వార్త శ్రీ లీల అభిమానులని అలాగే సినీ వర్గాల వారిని షాక్ కి గురిచేస్తుంది.

సాధారణంగా ఒక సినిమాలో హీరోయిన్ నటన బాగుంటే మన పక్కింటి అమ్మాయిలా ఉందని అంటారు. అంతే కానీ తన అందం గురించి పెద్దగా పొగడరు. కానీ శ్రీ లీల విషయంలో వచ్చే సరికి పక్కింటి అమ్మాయిలా నటించిందని అనడంతో పాటు మంచి అందంగా కూడా ఉందని చెప్తారు. అందుకే తనకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు లో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా అందులో హీరోయిన్ గా శ్రీ లీలే ఉంటుంది. పోటీ వాతావరణం ఉండే సినీ పరిశ్రమలో శ్రీ లీల అతి తక్కువ కాలం లోనే అగ్రహీరోయిన్ స్థాయికి అంత ఈజీగా రాలేదు. నటనతో పాటు ఒళ్ళు హూనమయ్యే లా డాన్సులు వేస్తూ ప్రేక్షకుల్లో మంచి మార్కులు కొట్టింది కాబట్టే శ్రీ లీల కి అంత క్రేజ్.

ఇక అసలు విషయంలోకి వస్తే..శ్రీ లీల కి హెల్త్ ఇష్యుస్ ఎక్కువయ్యాయని తనకి ఉన్న ప్రాబ్లెమ్ ప్రకారం శ్రీ లీల ఒకసారి తుమ్మితే ఇక వరుసగా తుమ్ములు వస్తాయంట అంటే ఒకసారి తుమ్మితే సుమారు 20 నిమిషాల దాకా అలాగే తుమ్ముతూనే ఉంటుంది. అరుదైన ఈ వ్యాధి నివారణకు శ్రీ లీల ఎంతో మంది డాక్టర్ లని సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందనే వార్త లు వస్తున్నాయి.దీంతో శ్రీ లీల అభిమానులు అయ్యో మా శ్రీ లీల కి ఇలాంటి వ్యాధి రావడమేంటని బాధపడుతున్నారు. కొంత మంది అయితే ఇలాంటి వ్యాధి ఉంటే శ్రీ లీల కి పెళ్లి అవ్వడం కూడా కష్టమే అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు. శ్రీ లీలకి ఉన్న ఈ వ్యాధి వల్ల కొన్ని సార్లు శ్రీ లీల షూటింగ్ లకి లేటుగా వెళ్లడం అలాగే షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా జరిగాయని అంటున్నారు.కాగా తనకున్న ఈ తుమ్ముల సమస్య గురించి శ్రీలీల గతంలో ఓ మూవీ ప్రమోషన్స్ లో చెప్పింది. అయితే ఆ సమస్య ఇప్పటికీ తగ్గలేదని తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.