English | Telugu
టైగర్ నాగేశ్వరరావు మీద దాడి..
Updated : Oct 11, 2023
రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవి తేజ సినీ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్నటైగర్ నాగేశ్వరరావు సినిమాపై రవితేజ అభిమానుల్లోనూ ,సినీ వర్గాల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. వాళ్ళందరి అంచనాలకి తగ్గట్లే ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయ్యి టైగర్ నాగేశ్వరరావు సినిమా గ్యారంటీ హిట్ అని అందరు అనుకునేలా చేసింది. దసరా కానుకగా ఈ నెల 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న టైగర్ నాగేశ్వరరావు మీద జరిగిన దాటి సంచలనం సృష్టిస్తుంది.
అప్పటి గుంటూరు జిల్లా ఇప్పటి బాపట్ల జిల్లా లోని స్టూవర్టుపురం అనే గ్రామానికి చెందిన కరుడు గట్టిన నేరస్థుడు ది మోస్ట్ ఇండియన్ బెస్ట్ థీఫ్ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా టైగర్ నాగేశ్వరావు మూవీ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అభిషేక్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. రవితేజ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయం తో ఈ సినిమా ని అభిషేక్ నిర్మించారు .తెలుగు తో పాటు తమిళ,మలయాళ, కన్నడ ,హిందీ భాషల్లో ఈ సినిమా ని ఆయన రిలీజ్ చేస్తున్నారు. అభిషేక్ గతంలో చాలా చిత్రాలని నిర్మించడంతో పాటు ఎన్నో సినిమాలని డిస్ట్రిబ్యూటర్ హోదాలో రిలీజ్ చేసారు. ఆయనకి సంబంధించిన కార్యాలయం ఫిలింనగర్ లో ఉంది. ఇప్పడూ ఆయన ఆఫీస్ మీద ఐ.టి అధికారుల దాడి జరిగింది.
కొంత మంది ఐ.టి అధికారులు హఠాత్తుగా అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ మీద దాడి చేసి టైగర్ నాగేశ్వరరావు సినిమాని ఎన్ని డబ్బులతో నిర్మించారు, ఆ సినిమా కి సంబంధించిన లెక్కలు మొత్తం సరిగానే చూపించారా,జిఎస్టి సరిగానే కట్టారా అనే వివరాలని సేకరించారు. సినిమా కి ఒక రేంజ్ లో ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ 20 వ తారీఖున విడుదలకి సిద్ధం అవుతున్న టైగర్ నాగేశ్వరరావు మీద ఇప్పుడు ఐ.టి దాడులు జరగడం ఫిలిం వర్గాలతో పాటు రవి తేజ అభిమానులు సినీ అభిమానుల్లో సంచలనం సృష్టిస్తుంది. రేణు దేశాయ్, నుపుర్ సనన్,గాయత్రి భరద్వాజ్,నాజర్ ,అనుపమ్ ఖేర్ ,తదితర భారీ నటులు నటించారు.వంశీ ఈ సినిమా కి దర్శకుడు..