English | Telugu
‘ఇండియన్ 2’ రిలీజ్ ఇంకా తేలలేదు.. ‘ఇండియన్ 3’ కూడా రెడీ అయిందట!
Updated : Oct 11, 2023
ఈమధ్యకాలంలో అసలు సినిమా కంటే సీక్వెల్స్ హాడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే దానికి రెండో పార్ట్ ఉంటుంది, మూడో పార్ట్ ఉంటుంది అని ప్రకటనలు గుప్పించేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక సినిమా రిలీజ్ అయి సూపర్‌హిట్ అయితే దానికి సీక్వెల్‌ఉంటుందని ప్రకటించడంలో అర్థం ఉంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే సీక్వెల్ గురించి ప్రకటించడం బిజినెస్ పరంగా నష్టమే ఎక్కువగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
అసలు విషయానికి వస్తే.. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 27 సంవత్సరాల క్రితం వచ్చిన ‘ఇండియన్’(తెలుగులో ‘భారతీయుడు) చిత్రం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అప్పటి ట్రెండ్‌కి భిన్నంగా హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను గడగడలాడిరచింది. అయితే ఆ సినిమా క్లైమాక్స్‌లో ఇండియన్ కమల్‌హాసన్ ఏమయ్యాడో అర్థం కాకుండా చూపించి తర్వాత అతను ఫారిన్‌లో ఉన్నట్టు రివీల్ చేశారు. దాంతో దాన్ని సీక్వెల్‌గా చేసే అవకాశం కలిగింది.
ఆ సినిమాకి సీక్వెల్ చేసేందుకు కమల్, శంకర్ ఇద్దరూ సిద్ధపడ్డారు. మొదట ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఫైనల్‌గా లైకా ప్రొడక్షన్స్ లైన్‌లోకి వచ్చి సినిమా నిర్మాణం చేపట్టింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అయి నాలుగేళ్ళు గడుస్తున్నా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఆమధ్య కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోవడం, షూటింగ్‌లో ప్రమాదాలు జరగడంతో సినిమా డిలే అయిపోయింది. చివరికి లైకా ప్రొడక్షన్స్‌తో రెడ్ జైంట్ సంస్థ కూడా కలవడంతో సినిమాని పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడిరది.
ఇప్పుడు ఇండియన్ 2 షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏమిటంటే ‘ఇండియన్ 3’ కూడా ఉంటుందని అంటున్నారు. ఇండియన్ 2 షూటింగ్ పూర్తయిందని, మరో 30 రోజులు షూటింగ్ చేస్తే ఇండియన్ 3 కూడా పూర్తవుతుందని సమాచారం. దీంతో ఇండియన్ 3 గురించి కూడా ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఇండియన్ 2 రిలీజ్‌కి నోచుకోలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంతలోనే ఇండియన్ 3 కూడా ఉంటుందనే వార్తలు రావడంతో ఈ సినిమా భవితవ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి ఏర్పడిరదని తమిళ్ ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.