కట్టిపడేస్తున్న నాని 'హాయ్ నాన్న' టీజర్.. ఏం ఫీల్ ఉంది మామా!
నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'హాయ్ నాన్న'. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా, నాని కూతురి పాత్రలో బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.