English | Telugu
విమానంలో హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన తోటి ప్రయాణికుడు.. అసలేం జరిగింది?
Updated : Oct 11, 2023
ఫ్లైట్‌లో ప్రయాణించే వారందరూ డీసెంట్‌గా ఉంటారనే నమ్మకం లేదు. పోకిరీలు, ఇండీసెంట్ పర్సన్స్ ప్రతిచోటా ఉంటారు. అలాగే విమాన ప్రయాణాల్లోనూ ఎదురవుతుంటారు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో కొంతమంది కొన్ని చేదు అనుభవాలు ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ హీరోయిన్‌కి ఆ పరిస్థితి వచ్చింది. ప్రముఖ మలయాళ హీరోయిన్ దివ్యప్రభ తనకు ఎయిర్ ఇండియా విమానంలో అవమానం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రయాణంలో తన తోటి ప్రయాణికుడు తనని వేధించాడని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడమే కాకుండా పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చింది.
తనకు జరిగిన అవమానాన్ని హీరోయిన్ దివ్యప్రభ వివరిస్తూ ‘ముంబై నుండి కొచ్చికి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎఐ 681లో ఈ ఘటన జరిగింది. అది మీ దృష్టికి తెస్తున్నాను. నన్ను సపోర్ట్ చెయ్యమని కోరుతున్నాను. నా తోటి ప్రయాణికుడు మద్యం సేవించి నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. టేకాఫ్ ముందు అతన్ని మరో సీటుకు మాత్రమే మార్చారంతే. కొచ్చిలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేశాను. విమానాశ్రయంలోని పోలీసుల వద్దకు నన్ను పంపారు. అలాగే కేరళ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేయమని కోరాను’ అని తెలియజేసింది.