English | Telugu
సడన్‌గా రిలీజ్ అవుతున్న ధనుష్ మూవీ!
Updated : Oct 11, 2023
ఈ వారం చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్ద సినిమాలు అసలు లేవు. తమిళ్‌లో జయం రవి, నయనతార నటించిన గాడ్ సినిమా ఉంది. కానీ, ఈ సినిమాలో వయొలెన్స్ ని పిల్లలు తట్టుకోలేరని, పిల్లలని తీసుకునిరావద్దనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మళ్లీ యూత్, ఫ్యామిలీ చూడదగ్గ సినిమాలు చెప్పుకోదగ్గవైతే లేవు. తెలుగులోనూ దాదాపు పది దాకా చిన్న సినిమాలు రిలీజ్‌కి క్యూలో ఉన్నాయి. తన సినిమా రిలీజ్‌కి ఇంతకన్నా మంచి తరుణం లేదని అనుకున్నట్టున్నారు హీరో ధనుష్. పర్ఫెక్ట్ టైమ్ ఇదే, సినిమాను రిలీజ్ చేసేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నారు. హీరోగారి గ్రీన్ సిగ్నల్ చూశాక, మేకర్స్ ఆగుతారా? ఆగమేఘాల మీద అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ వారం వడచెన్నై విడుదలకు సర్వ సన్నాహాలు పూర్తయ్యాయి. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన సినిమా వడచెన్నై. 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా వచ్చేవారానికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది. వడచెన్నై సినిమాకు స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని వడచైన్నైలో ఈ నెల 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. 1987 నుంచి 2003 వరకు జరిగిన కథతో తెరకెక్కించారు వడచెన్నైని. నార్త్ చెన్నైలోని కేరమ్ ప్లేయర్‌కి సంబంధించిన కథతో సాగుతుంది వడచెన్నై.
యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది. ధనుష్ కి జోడీగా ఆండ్రియా జెరీమియా నటించారు. ఆమీర్, సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, రాధా రవి, సాయి ధీనా తదితరులు నటించారు. వడచెన్నైకి త్వరలోనే సీక్వెల్ తెరకెక్కించాలన్నది వెట్రిమారన్ ప్లాన్. సూర్య హీరోగా నటించే వాడివాసల్ షూటింగ్ కంప్లీట్ అయ్యాక వడచెన్నైని రూపొందించాలని అనుకుంటున్నారు. ధనుష్ ప్రస్తుతం అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్‌లో నటిస్తున్నారు.