English | Telugu

అమ‌లాపాల్‌కి రెండో పెళ్లి... వరుడు ఎవరో తెలుసా?

మ‌ల‌యాళ న‌టి అమ‌లాపాల్ సౌత్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. తెలుగు ప్రేక్ష‌కుల విష‌యానికి వ‌స్తే ఆమె అనువాద చిత్రాల‌తో పాటు స్ట్ర‌యిట్ మూవీస్‌లోనూ న‌టించి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. త‌న సినిమాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోనూ ఆమె ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తూ వ‌స్తుంది. తాజాగా ఆమె రెండో పెళ్లికి సంబంధించిన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అయ్యింది. ఆమె స్నేహితుడు జ‌గ‌త్ దేశాయ్‌తో పెళ్లి జ‌ర‌గ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు సంబంధించిన ప్ర‌పోజ‌ల్ వీడియోను జ‌గ‌త్ దేశాయ్ త‌న సోష‌ల్ మీడియాలో అకౌంట్‌లో షేర్ చేయ‌గా అది తెగ వైర‌ల్ అవుతోంది.