English | Telugu
బీరువా తాళాలు ఆ వ్యక్తికి ఇస్తాను..హీరో నాగార్జున
Updated : Oct 26, 2023
తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పొట్టి శ్రీరాములు ఎలా అయితే కసిగా ఆలోచించారో.. తెలుగు వాళ్ళు తమ తెలుగు రాష్ట్రంలోనే షూటింగ్ జరుపుకోవాలని అక్కినేని నాగేశ్వరావు కూడా అంతే కసిగా ఆలోచించారు. ప్రతి తెలుగు వాడు గర్వపడేలా అన్నపూర్ణ స్టూడియో కి రూపకల్పన చేసి ఎంతో మందికి ఉపాధిని కల్పించాడు. ఏఎన్ఆర్ తర్వాత ఆయన వారసుడు నాగార్జున అన్నపూర్ణ భాద్యతలుని తీసుకొని అధునాతన రీతిలో స్టూడియో ని అభివృద్ధి చేసి సౌత్ లోనే అన్నపూర్ణ స్టూడియో నెంబర్ వన్ స్టూడియో అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా నాగార్జున తన స్టూడియోలో పనిచేస్తున్న ఎంప్లాయిస్ కి సంబంధించి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చి నాగార్జున ది ఎంత మంచి మనసో మరోసారి గుర్తుచేశాడు.
నాగార్జున ఎంత మంచి నటుడో అంతే మంచి మనిషి. నాగ్ మనుసులో ఎలాంటి కల్మషం ఉండదు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈర్ష్య ,అసూయలకి పెట్టింది పేరు. తన సినిమా ప్లాప్ అయ్యి ఇంకో హీరో సినిమా హిట్ అయినా కూడా నాగ్ లో ఎలాంటి ఈర్ష్య ఉండదు. అందుకే నాగ్ ఇంకా అంత గ్లామర్ గా ఉన్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ షోతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇక అసలు విషయంలోకి వస్తే నాగార్జున తాజాగా ఒక అధ్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తన స్టూడియో లో పని చేస్తున్న వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియచెయ్యాలనే ఉద్దేశంతో అన్నపూర్ణ స్టూడియో హీరోస్ పేరుతో ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అన్నపూర్ణ స్టూడియోలో రామాచారి అనే ఆయన అకౌంటెంట్ గా చేస్తున్నారు. రామాచారి అన్నపూర్ణ స్టూడియో ప్రారంభం అయినప్పటి నుంచి అకౌంటెంట్ గా
వర్క్ చేస్తున్నారు. అంటే సుమారు 47 సంవత్సరాల నుంచి రామాచారి అన్నపూర్ణ లో పనిచేస్తున్నాడు. అన్నపూర్ణ సంస్థలో తొలి ఎంప్లాయ్ కూడా ఆయనే. ఇదే విషయాన్నీ నాగార్జున వీడియో రూపంలో చెప్పాడు. అలాగే రామాచారి కి బీరువా తాళాలు ఇచ్చేంత నమ్మకం అని కూడా చెప్పాడు. రామాచారి కూడా ఆ వీడియో లో మాట్లాడుతు అన్నపూర్ణ సంస్థలో పని చెయ్యడం తన అదృష్టమని నాగేశ్వరరావు గారు ,నాగార్జున గారు నన్ను చాలా బాగా చూసుకుంటారని నేను ఇల్లు కట్టుకునేటప్పుడు డబ్బులు సహాయం చేసారని చెప్పాడు. అలాగే అన్నపూర్ణ సంస్థ ఎదగడానికి రామాచారి లాంటి ఉద్యోగస్తులే కారణం అని కూడా నాగార్జున నిర్మొహమాటంగా చెప్పాడు. కింగ్ అంటే అలాగే ఉంటాడు మరి..