English | Telugu
సడన్‌గా ఇండియాలో సమంత.. వచ్చింది అందుకేనా?
Updated : Oct 26, 2023
‘ఖుషి’ రిలీజ్ తర్వాత సడన్‌గా అమెరికా వెళ్ళిపోయిన సమంత అక్కడ విశ్రాంతి తీసుకుంటూ మధ్య మధ్యలో తాను ఎక్కడ వున్నదీ అభిమానులకు తెలియజేస్తూ అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. అయితే ఎలాంటి సమాచారం లేకుండా సడన్‌గా సమంత ముంబయిలో ప్రత్యక్షమైంది. ఎప్పుడు వచ్చిందో తెలీదుగానీ ఆమె ఫోటోలు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత సడన్‌గా మళ్లీ ఇండియా ఎందుకు వచ్చింది అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. కొత్తగా ఏదైనా సినిమా కమిట్ అయ్యిందా? లేక వెబ్ సిరీస్ ఏదైనా కన్‌ఫర్మ్ అయ్యిందా?... ఇలా రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.
అయితే ఇవేవీ కాదని తెలుస్తోంది. తను ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రచారం కోసం సమంత ఇండియా వచ్చిందనేది తాజా సమాచారం. ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ త్వరలోనే ప్రసారం కాబోతోంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కి రాజ్ అండ్ డికె దర్శకత్వం వహించారు. ఇది ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌కి ఇండియన్ వెర్షన్. ప్రియాంక చోప్రా నటించిన పాత్రను సమంత చేస్తోంది. ఆమె ఇండియా రావడానికి ఈ వెబ్ సిరీస్ ఒక్కటే కారణం కాదు. కొన్ని బ్రాండ్స్‌కి కూడా సమంత ప్రచారం చేసేందుకు ఇక్కడికి వచ్చింది. అందులో తాను సొంతంగా నడుపుడుతున్న ‘సాకి’ ఒకటి ఉంది. దానికి కూడా సమంత ఫోటో షూట్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పట్లో సమంత సినిమాలు ఒప్పుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతోందని సమాచారం.