థియేటర్స్ నుంచి ఇంటికి వచ్చేస్తోంది.. పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారు?
ఆమధ్య ఓ సినిమాని పిల్లలతో కలిసి చూడొద్దని గట్టిగా చెప్పారు. అంటే ఆ సినిమాలో అంత హింస ఉందనేది వారి ఉద్దేశం. ఈ విషయాన్ని ఎవరో కాదు, హీరోనే చెప్పడం విశేషం. ఇంతకీ ఏ సినిమా అది, ఆ హీరో ఎవరు? ఆ సినిమా పేరు తమిళ్‌లో ఇరైవన్, తెలుగులో గాడ్, ఆ చెప్పిన హీరో జయం రవి. ఇటీవల గాడ్ చిత్రం విడుదలైంది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేదు. అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని పాస్ చేసేశారట. జయం రవి తన అద్భుతమైన పర్ఫార్మెన్స్, నయనతార అందం, అభినయం తమిళ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లోనే ఉండడంతో సినిమా మంచి విజయం సాధించింది. దర్శకుడు ఐ.అహ్మద్‌కు డైరెక్టర్‌గా మంచిపేరు వచ్చింది....