English | Telugu
‘లియో’ హిట్టా..ఫట్టా... కలెక్షన్లు వచ్చాయా.. రాలేదా?.. ఒకటే కన్‌ఫ్యూజన్!
Updated : Oct 26, 2023
విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘లియో’కి వచ్చిన హైప్ మామూలుది కాదు. రిలీజ్‌కి ముందే సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్ళి నిలబెట్టిందా హైప్. లోకేష్ క్రియేట్ చేసిన ఎల్‌సియులో భాగంగా లియో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకి హైప్ పెరగడంతో భారీ అంచనాల మధ్య ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయింది. ‘లియో’ విజయ్ కెరీర్‌లోనే ఫస్ట్ ఫాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమా ఎల్‌సియులో భాగమే అన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ, సినిమాలో అలాంటి క్లూ ఒక్కటి కూడా లేదు. అందరూ ఎల్‌సియులో భాగమే అని అందరూ అనుకోవడంతో బజ్ క్రియేట్ అయింది. మరి దానికి తగ్గట్టుగా కలెక్షన్స్ ఉన్నాయా? నిర్మాతలు చెబుతున్నవి కరెక్ట్ లెక్కలేనా? అందులో ఏదైనా మతలబు వుందా? అనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు.
‘లియో’ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. రూ.140 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ప్రకటించారు. దీన్ని బట్టే తర్వాతి మూడు రోజులు కూడా భారీగా లెక్కలు చూపించారు. ఇదిలా ఉంటే యు.ఎస్. కలెక్షన్స్ విషయంలో తప్పు జరిగిందని, మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లన్నీ క్రియేట్ చేసినవేనని కోలీవుడ్ వర్గాలే విమర్శించడం గమనార్హం. మేకర్స్ చెబుతున్న లెక్కలు, కోలీవుడ్ వర్గాల విమర్శల్లో ఎంత వరకు నిజముందో తెలీదుగానీ, వారంరోజుల్లో ఈ సినిమా రూ.500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందనే టాక్ మాత్రం వినిపిస్తోంది. మరోపక్క కోలీవుడ్‌లోని అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కంప్లీట్ చేసిందని చెబుతున్నారు. కొన్ని ఏరియాలు మినహాయిస్తే దాదాపు అన్ని చోట్లా లాభాల్లోకి వెళ్లిపోయిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్లకు పైగా గ్రాస్.. రూ. 20 కోట్లకు పైగా షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. డబ్బింగ్ సినిమాలలో లియో హయ్యస్ట్ గ్రాసర్ కాబోతోందన్నమాట. తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా లెక్కలు కనిపిస్తుండగా తమిళ్, యు.ఎస్‌ల కలెక్షన్స్ మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఏ సినిమాకీ రాని సమస్య ఇంత పెద్ద సినిమా ఫేస్ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఈ కన్‌ఫ్యూజన్‌కి కారణం ఏమిటి? అనేది మేకర్స్ తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.