English | Telugu

బెడ్ రూమ్‌లో ప్రముఖ నటి ఆత్మహత్య!

సినిమా రంగానికి సంబంధించి ఇటీవలి కాలంలో విషాదవార్తలు బాగా వినిపిస్తున్నాయి. రకరకాల కారణాలతో ఎంతో మంది కన్ను మూశారు. ముఖ్యంగా సౌత్‌ ఇండియన్‌ సినిమాలో ఎక్కువ విషాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా తిరువనంతపురంలో ఒక హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మలయాళ సినిమాల్లో సహాయనటిగా, ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటిగా ఎంతో పాపులర్‌ అయిన రెంజుషా మీనన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. 35 ఏళ్ళ చిన్న వయసులోనే రెంజుషా చనిపోవడం మలయాళ ఇండస్ట్రీని కలచివేసింది. తిరువనంతపురం శ్రీకార్యంలోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది రెంజుషా. ఆమె భర్త మనోజ్‌ కూడా సినీ పరిశమ్రకు చెందినవాడే. రెంజుషా ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

త‌రుణ్ భాస్క‌ర్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ!

రౌడీ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న్ని హీరోగా నిల‌బెట్టిన సినిమా పెళ్లిచూపులు. త‌ర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్నారు. అయితే పెళ్లి చూపులు మాత్రం విజ‌య్‌కి హీరోగా గుర్తింపునిచ్చింది. ఆ త‌ర్వాత ఎందుక‌నో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌లేదు. పెళ్లి చూపులు రిలీజై ఏడేళ్లు అవుతోంది. అయితే తాజాగా త‌రుణ్ భాస్క‌ర్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నుందంటూ స్వ‌యంగా విజ‌య్ దేవ‌రకొండ అనౌన్స్ చేయటం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. త‌రుణ్ భాస్క‌ర్ రాసిన స్క్రిప్ట్‌ను రీసెంట్‌గా తాను లాక్ చేశాన‌ని, త్వ‌ర‌లోనే ఇద్ద‌రి కల‌యిక‌లో సినిమాను చూస్తారంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ కీడా కోలా స్టేజ్‌పై చెప్పారు.