English | Telugu

కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ మూవీ

మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్ సినిమా డిజాస్ట‌ర్ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో ఆయ‌న మోకాలి శ‌స్త్ర చికిత్స కూడా చేసుకున్నారు. ఇప్పుడు అంతా సెట్ అనుకున్న త‌ర్వాత నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. నిజానికి మెగా 157గా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌నుకున్న సినిమాను మెగా 156గా ముందుగా షూటింగ్‌ను స్టార్ట్ చేసేస్తున్నారు. సోషియో ఫాంట‌సీ కాన్సెప్ట్‌తో సినిమా స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మూవీ అవ‌గానే చిరంజీవి నెక్ట్స్ మూవీని వెంట‌నే స్టార్ట్ చేయ‌టానికి రెడీ అయిపోతున్నార‌ని సినీ స‌ర్కిల్స్  స‌మాచారం.

లావ‌ణ్య బ్యాచిల‌ర్ పార్టీ.. ఫొటోలు వైర‌ల్

టాలీవుడ్ హీరో వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిని ఆయ‌న వివాహం చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా డెస్టినేష‌న్ వెడ్డింగ్. ఇట‌లీలోని టుస్కానీ విలేజ్‌లో న‌వంబ‌ర్ 1న‌ ఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఒక్క‌టి కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాటు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్ అన్న‌య్య‌, హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఇటలీలో చేరుకున్నారు. కాబోయే వ‌రుడు వ‌రుణ్ తేజ్ కూడా ఇట‌లీ చేరుకున్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ కాబ‌ట్టి ప‌రిమిత సంఖ్య‌లో కుటుంబ స‌భ్యులు, మిత్రులు, స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహానికి హాజ‌రు కాబోతున్నారు.

‘గేమ్ ఛేంజర్’ ప్లానింగ్ ఫిక్స్

మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్, సునీల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్స్ లేవు. మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుంద‌నే దానిపై శంక‌ర్ రీసెంట్‌గా క్లారిటీ ఇవ్వ‌లేదు కానీ.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసే అవ‌కాశాలున్నాయ‌ని సినీ స‌ర్కిల్స్ స‌మాచారం.

త‌గ్గేదేలే అంటున్న య‌ష్‌.. ఆ సినిమా కోసం రూ.150 కోట్లు డిమాండ్!

KGF 1, KGF 2 చిత్రాల‌తో పాన్ ఇండియా హీరోగా మారారు రాకింగ్ స్టార్ య‌ష్‌. ఈ రెండింటిలోనూ KGF 2 ఏకంగా 1200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. దీంతో య‌ష్ రేంజ్ ఆకాశాన్నంటింది. దీంతో ఆయ‌న నెక్ట్స్ మూవీ ఏదోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదిన్న‌ర‌గా య‌ష్ ఖాళీగా ఉంటున్నారు కానీ.. కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయ‌నేలేదు. ఇది ఆయ‌న అభిమానులను క‌ల‌వ‌పెడుతుంది. రీసెంట్‌గా ఓ లేడీ డైరెక్ట‌ర్‌తో క‌లిసి మరోసారి మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ చేయ‌బోతున్నారంటూ కూడా వార్త‌లు వినిపించాయి. కానీ దీంతో పాటు ఇప్పుడు మ‌రో న్యూస్ కూడా నెట్టింట వైర‌ల్ అవుతుంది.

మెగాఫోన్ ప‌ట్ట‌నున్న న‌టి రోహిణి

ప్ర‌స్తుతం తెలుగు సినిమాల్లో అమ్మ‌, అత్త వంటి క్యారెక్ట‌ర్స్‌తో న‌టిగా ఆక‌ట్టుకుంటోన్న సీనియ‌ర్ యాక్ట్రెస్‌ల్లో రోహిణి ఒక‌రు. అంతే కాదండోయ్ ఆమె మంచి డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే మ‌రో వైపు రోహిణిలో మంచి ద‌ర్శ‌కురాలు కూడా ఉంది. 18 ఏళ్ల ముందు అంటే 2005లో చిన్ని చిన్ని ఆశై అనే మూవీని రోహిణి డైరెక్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఓ డాక్యుమెంట‌రీ చిత్రాన్ని కూడా ఆమె తెర‌కెక్కించారు. త‌ర్వాత ఎందుక‌నో మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. అయితే చాలా ఏళ్ల త‌ర్వాత రోహిణి మ‌రోసారి యాక్ష‌న్, క‌ట్ చెప్ప‌టానికి రెడీ అవుతున్నార‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం.

తెలుగు చిత్ర‌సీమ‌పై ప్ర‌కాష్ రాజ్ ఘాటు వ్యాఖ్య‌లు

69వ జాతీయ అవార్డుల వేడుక‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్త‌మ న‌టుడిగా అవార్డును అందుకున్న సంగ‌తి తెలిసిందే. 69వ ఏళ్ల సినీ చ‌రిత్ర‌లో ఇంత‌కు ముందు ఎవ‌రూ సాధించ‌ని ఘ‌న‌త‌ను బ‌న్ని సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా ఢిల్లీలో అల్లు అర్జున్ వెళ్లి రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డును స్వీక‌రించారు. హైద‌రాబాద్ చేరుకున్న ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. పుష్ప ది రైజ్ సినిమాలో బ‌న్ని న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ‌న‌టుడుగా అవార్డు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఘ‌నంగా సెలబ్రేష‌న్స్‌ను నిర్వ‌హించింది. ఈ వేడుక‌ల‌కు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.