English | Telugu

పరభాషా నటులు సైతం అసూయపడే కీర్తి ప్రభాస్ సొంతం

తెలుగు చలన చిత్ర పరిశ్రమ పుట్టినప్పటి నుంచి ఎంతో మంది హీరోలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు. అంటే  కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమ నుంచి కనుమరుగైపోతున్నారు. కానీ కొంత మంది మాత్రమే తెలుగు కళామ తల్లి ఒడిలో ముద్దు బిడ్డలుగా నిలిచి పోతారు. నిలిచి పోవడమే కాదు తెలుగు కళామ తల్లి కీర్తిని విశ్వ వ్యాప్తం చేసి పరబాషా  సినిమా ఇండస్ట్రీని సైతం తెలుగు సినీ పరిశ్రమ వైపు చూసేలా చేస్తారు. అలా పరభాషా చిత్ర పరిశ్రమని తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసేలా చెయ్యడమే కాకుండా వాళ్ళందరూ అసూయ పడేలా సైతం కీర్తిని సంపాదించిన నటుడు ప్రభాస్.