English | Telugu

మెగాస్టార్ రేంజ్ ని అమాంతం పెంచేసిన 'ఖైదీ'కి 40 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే సినిమా 'ఖైదీ'. చిరంజీవి రేంజ్ ని అమాంతం ఎన్నో రేట్లు పెంచేసిన చిత్రమిది. అందుకే ఈ సినిమా మెగాస్టార్ కి, మెగా అభిమానులకి ఎంతో ప్రత్యేకమైనది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంయుక్త మూవీస్ నిర్మించిన ఈ మూవీ 1983, అక్టోబర్ 28న విడుదలై ప్రభంజనం సృష్టించింది. అమెరికన్ ఫిల్మ్ 'ఫస్ట్ బ్లడ్'ను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిన ఈ చిత్రం, తెలుగు సినీ పరిశ్రమలో అప్పటిదాకా ఉన్న రికార్డులను చెరిపేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో ఇదే మొదటి ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం.

ఆంధ్రా వారితో దిల్ రాజు వియ్యం... జైపూర్‌‌లో పెళ్లి!

ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లి భాజాల‌కు స‌మ‌యం వ‌చ్చిన‌ట్లుంది. మెగా ఫ్యామిలీలో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిలు ఇట‌లీలో పెళ్లి చేసుకోనున్నారు. మ‌రో వైపు హీరో వెంక‌టేష్ రెండో కుమార్తె వివాహం కూడా జ‌ర‌గ‌నుంది. రీసెంట్‌గానే నిశ్చితార్థం కూడా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అలాగే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి రెండో త‌న‌యుడు, హీరో శ్రీసింహ, ముర‌ళీ మోహ‌న్ మ‌న‌వరాలితో పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. ఈ క్ర‌మంలో తెలుగు చిత్రీసీమ‌కు చెందిన మ‌రో ప్ర‌ముఖ వ్య‌క్తి ఇంట్లో పెళ్లి భాజాలు మోగ‌నున్నాయి. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. దిల్ రాజు. ఈ అగ్ర నిర్మాత సోద‌రుడు, శిరీష్ త‌న‌యుడు ఆశిష్ రెడ్డి త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

NBK 110 క్రేజీ అప్‌డేట్.. సుకుమార్‌తో బాల‌య్య‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 108వ చిత్రంగా భ‌గ‌వంత్ కేస‌రి ఈ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 19న ఆడియెన్స్ ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న త‌న 109వ చిత్రాన్ని బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టటం బాల‌య్య స్టైల్. అయితే ఈసారి అంత కంటే స్పీడుగా ఆయ‌న త‌న 110వ సినిమాను సిద్ధం చేయ‌టానికి రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని టాక్ సినీ స‌ర్కిల్స్‌లో గ‌ట్టిగా వినిపిస్తోంది. అయితే ఈసారి వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు నందమూరి క‌థానాయ‌కుడు ఓ క్రేజీ డైరెక్ట‌ర్‌తో సినిమా చేయ‌బోతున్నారు. ఇంత‌కీ బాల‌య్య త‌న 110వ సినిమాలో కలిసి వ‌ర్క్ చేయాల‌నుకుంటున్న డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సుకుమార్ అని టాక్‌.

అమ్మ కోరిక తీర్చ‌నున్న మ‌హేష్‌ బాబు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త్వ‌ర‌లోనే త‌న తల్లి ఇందిరమ్మ కోరిక‌ను తీర్చ‌టానికి రెడీ అవుతున్నారంటూ సినీ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు ఇంత‌కీ అమ్మ కోరిక‌ను తీర్చ‌టానికి మ‌హేష్ ఏం చేయ‌బోతున్నారు..అంత‌లా మ‌హేష్ అమ్మ‌గారు కోరిన కోరిక ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే, మ‌హేష్ పిల్ల‌లు గౌత‌మ్‌, సితారలు సోష‌ల్ మీడియాలో ఫ్యామిలీతో క‌నిపిస్తూనే ఉంటారు. మ‌రీ ముఖ్యంగా సితార అయితే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తండ్రికి పోటీగా అప్పుడే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లోనూ న‌టించ‌టానికి రెడీ అయిపోయింది. ఈమెకు సంబంధించిన మ‌హేష్ ఓ శుభ‌కార్యాన్ని త‌న ఇంట్లో నిర్వ‌హించ‌బోతున్నారు. అది కూడా త‌ల్లి కోరిక మీద‌. అదేదో కాదు. ఓణీల ఫంక్ష‌న్‌.