English | Telugu
అమలాపాల్‌కి రెండో పెళ్లి... వరుడు ఎవరో తెలుసా?
Updated : Oct 26, 2023
మలయాళ నటి అమలాపాల్ సౌత్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే ఆమె అనువాద చిత్రాలతో పాటు స్ట్రయిట్ మూవీస్‌లోనూ నటించి అలరించిన సంగతి తెలిసిందే. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ఆమె ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తుంది. తాజాగా ఆమె రెండో పెళ్లికి సంబంధించిన వార్తొకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె స్నేహితుడు జగత్ దేశాయ్‌తో పెళ్లి జరగనుందనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రపోజల్ వీడియోను జగత్ దేశాయ్ తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది.
జగత్ దేశాయ్..కేవలం ఏదో వీడియో షేర్ చేశాడులే, అదేదో ప్రమోషనల్ వీడియో అనుకోవటానికి కూడా వీలులేదు. అందులో నా కలల రాణి ఎస్ చెప్పిందంటూ హ్యాష్ ట్యాగ్‌ను జత చేయటం కొస మెరుపు. రెండో పెళ్లికి సిద్ధమైన అమలాపాల్‌కు నెటిజన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. జగత్, అమలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి దీనిపై అమలాపాల్ ఎలా రియాక్ట్ అవుతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. మలయాళ సినిమాలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అమలాపాల్.. తెలుగు ప్రేక్షకులకు బెజవాడ సినిమాతో పరిచయం అయ్యారు. తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో సహా పలు సినిమాల్లో నటించింది. అలాగే ఇతర అనువాద చిత్రాలతోనూ టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆమె అలరించింది.
హీరోయిన్‌గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను వివాహం చేసుకుంది. అయితే కొన్నేళ్లకే అంటే 2017లోనే వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అమలాపాల్ పెళ్లిపై పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో సినిమాలతో బిజీగా మారుతున్న తరుణంలో అమల పెళ్లి చేసుకోనుంది.