English | Telugu

రేపే మెగాస్టార్‌ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌.. బీ రెడీ!

ఈమధ్య స్టార్‌ హీరోలు తాము నటించిన సూపర్‌హిట్‌ సినిమాలతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల చాలా సినిమాలు రీ రిలీజ్‌ అయి మరోసారి సూపర్‌హిట్‌ అయ్యాయి, ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తమ అభిమాన హీరోల సినిమాలు మళ్ళీ థియేటర్స్‌కి వస్తున్నాయంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. 4కె ఫార్మాట్‌లో, డాల్బీ అటమాస్‌ సౌండ్‌తో ముస్తాబై వస్తున్న సినిమాలను ప్రేక్షకలు, అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి సూపర్‌హిట్‌ మూవీ ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్‌’ చిత్రం మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను రీ రిలీజ్‌ చెయ్యబోతున్నట్టుగా గతంలోనే వార్తలు వచ్చాయి. నవంబర్‌ 4న ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. 2004లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హిందీలో సంజయ్‌దత్‌ హీరోగా రాజ్‌కుమార్‌ హిరాని రూపొందించిన ‘మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌’ చిత్రాన్ని తెలుగులో జయంత్‌ సి. పరాన్జీ రీమేక్‌ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉందని అప్పట్లోనే మంచి పేరును సంపాదించుకున్నారు. చిరు కామెడీని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేశారు. ‘రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం’, ‘ఇన్‌ ఫ్రంట్‌ దేర్‌ ఈజ్‌ క్రోకడైల్‌ ఫెస్టివల్‌’, ‘వల్చర్‌ ఈటింగ్‌ హండ్రెడ్‌ బఫ్ఫల్లోస్‌, వన్‌ సైక్లోన్‌ ఫినిష్‌’ వంటి డైలాగ్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. నవంబర్‌ 4న మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న శంకర్‌దాదా ట్రైలర్‌ను అక్టోబర్‌ 27 సాయంత్రం 5.40 గంటలకు విడుదల చేయబోతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.