English | Telugu
‘అహం బ్రహ్మస్మి’ అటకెక్కలేదట.. అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్!
Updated : Oct 26, 2023
మంచు మనోజ్ సినిమా కెరీర్ ముగిసినట్టేనా అనే సందేహం అందరిలోనూ ఉంది. ఎందుకంటే 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు తర్వాత మరో సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా తర్వాత రెండు సినిమాల్లో గెస్ట్ క్యారెక్టర్లు చేశాడంతే. మళ్లీ కొన్నాళ్ళకు ‘అహం బ్రహ్మస్మి’ అంటూ ఓ కొత్త తరహా కథతో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకుడు. పోస్టర్ చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది. తప్పకుండా మనోజ్‌కు మంచి హిట్ సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు.
అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్ ఈ సినిమాపై దృష్టి పెట్టలేదని అర్థమవుతోంది. మొదటి భార్య ప్రణతిరెడ్డితో విడాకులు, ఈ సంవత్సరం భూమా మౌనికతో రెండో పెళ్ళి వంటి కారణాలతో సినిమా వాయిదా పడిరది. అతని పెళ్లి జరిగి ఆరు నెలలు దాటిపోతున్నా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఇక సినిమాని పక్కన పెట్టినట్టేనని అందరూ భావించారు. అయితే అనుకోకుండా ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ‘అహం బ్రహ్మస్మి’కి సంబంధించిన అప్‌డేట్ త్వరలోనే ఉంటుందని ప్రకటించాడు. మనోజ్ వ్యక్తిగత కారణాల వల్లే సినిమాను పక్కన పెట్టామని, అది మా ఇద్దరి అంగీకారంతోనే జరిగిందని చెప్పాడు. ఈ గ్యాప్‌లో మరో సినిమా చేసుకుంటానని మనోజ్‌తో చెప్పడం, అతను కూడా ఓకే చెప్పడంతో ‘ఆదికేశవ’ సినిమా స్టార్ట్ చేశాడు. అయితే ‘అహం బ్రహ్మస్మి’ సినిమా ఆగిపోలేదని, తప్పకుండా ఉంటుందని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సినిమాలోని ‘లీలమ్మో..’ అనే పాటను విడుదల చేశారు. ఈ ఫంక్షన్‌లో మాట్లాడుతూ శ్రీకాంత్ ‘అహం బ్రహ్మస్మి’ చిత్రం గురించిన అప్‌డేట్ ఇచ్చాడు.