English | Telugu
ప్రియుడితో శ్రీలీల లిప్‌లాక్.. వీడియో వైరల్!
Updated : Oct 26, 2023
హీరోయిన్ అంటే గ్లామర్‌కి మారుపేరు. సినిమాకి గ్లామర్ ఎంతో ముఖ్యం. కొన్ని సినిమాలకు కథ కంటే హీరోయిన్ గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అలాగని హీరోయిన్ గ్లామర్‌తోనే సినిమాలు సూపర్‌హిట్ అవ్వవు. కాకపోతే సినిమాకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది. ఇక సినిమాలో హీరోయిన్ హాట్ సీన్స్, లిప్‌టాక్స్ ఉంటే ఆ కథే వేరు. మరి ఒక రేంజ్ ఉన్న హీరోయిన్ లిప్‌లాక్ ఇచ్చిందంటే అది చర్చనీయాంశమే అవుతుంది. టాలీవుడ్ విషయానికి వస్తే ఇది వరకు లిప్‌లాక్స్ అనేవి చాలా పరిమితంగా వాడేవారు దర్శకులు. ఎంతో అవసరం అయితే తప్ప లిప్ లాక్స్ సినిమాలో ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. సినిమాల్లో లిప్‌లాక్స్‌ని ఆహ్వానిస్తున్నారు ప్రేక్షకులు.
ఇప్పుడు లిప్‌లాక్స్‌కి సంబంధించిన ప్రస్తావన ఎందుకొచ్చిందంటే... హీరోయిన్‌గా తన లెవల్‌ని సినిమా, సినిమాకీ పెంచుకుంటూ వెళుతున్న శ్రీలీల లిప్‌లాక్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ అందించిన విజయానందంలో ఉంది శ్రీలీల. త్వరలోనే తన నెక్స్‌ట్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. వైష్ణవ్‌తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఆదికేశవ’ నవంబర్ 10న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత శ్రీలీల చేసే సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. పవన్‌కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్‌బాబుతో గుంటూరు కారం చిత్రాలు చేస్తోంది. ఇవి కాక నితిన్, విజయ్ దేవరకొండలతో కూడా సినిమాలు చేస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు కన్‌ఫర్మ్ చెయ్యాల్సి ఉంది. ఇలా శ్రీలీల కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్న నేపథ్యంలో ఆమె ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇటీవల మీడియాకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ఒకవేళ టాలీవుడ్‌లో లిప్‌లాక్ సీన్ చెయ్యాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు?’ అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల సమాధానమిస్తూ ‘ఇప్పటివరకు అలాంటి సీన్ చెయ్యలేదు. ఇకపై చెయ్యను కూడా. నా మొదటి ముద్దు నా భర్తకే’ అంటూ పుష్పలో శ్రీవల్లిలా సమాధానం చెప్పింది శ్రీలీల.
ఇంతవరకు బాగానే ఉంది. శ్రీలీల అసలు లిప్‌లాక్ చెయ్యలేదా?.. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇవ్వక ముందు కన్నడలో కిస్, భరాతే అనే సినిమాల్లో నటించింది. కిస్ అనే సినిమాలో టైటిలే కిస్ కాబట్టి ఆ సినిమాలో కూడా ముద్దు సీన్లు బాగానే ఉన్నాయి. ఇందులో హీరోగా నటించిన విరాట్‌తో ముద్దు సీన్లలో రెచ్చిపోయింది శ్రీలీల. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో ఉంది కాబట్టి ముద్దు గురించి అడిగిన ప్రశ్నకు ఎంతో సంప్రదాయబద్దంగా సమాధానం చెబుతోంది... ఎందుకంటారు?