English | Telugu
చంద్రముఖి మీ ఇంటికొచ్చింది..బి కేర్ ఫుల్
Updated : Oct 26, 2023
కొన్ని కొన్ని సినిమాలు వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ప్రేక్షకుల మనసులో మాత్రం ఆ సినిమా యొక్క ఛాయ నిలిచిపోతుంది. అలా ప్రేక్షకులు మనసులో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమా చంద్రముఖి. ఆ సినిమాకి సీక్వెల్ గా అదే పేరుతో వచ్చిన సినిమా చంద్రముఖి 2 .ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించిన వార్త సినీ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది.
బాలీవుడ్ అగ్రకథానాయిక కంగనా రనౌత్ ,రాఘవ లారెన్స్ లు నటించిన చంద్రముఖి 2 సినిమా గత నెల సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. చంద్రముఖి మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన పి.వాసునే పార్ట్ 2 కి కూడా దర్శకత్వం వహించాడు. ఇప్పుడు చంద్రముఖి సరికొత్త రూపంతో ప్రేక్షులందర్నీ పలకరిస్తుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా చంద్రముఖి 2 ఈ రోజు అందరి ఇళ్లల్లోకి వచ్చేస్తుంది.
మొదటి పార్ట్ లో వేటరాజుని అంతం చేసిన చంద్రముఖి తిరిగి అదే ఇంట్లో ఆత్మ గా ఉంటుంది. ఒక గుడిలో పూజ చేయించుకోవడానికి చంద్రముఖి ఉన్న ఇంట్లోకి ఒక ఫ్యామిలి దిగుతుంది. ఆ ఫ్యామిలీ లోని ఒక అమ్మాయికి చంద్రముఖి ఆవహిస్తుంది. వాళ్ళు చెయ్యాలనుకున్న పూజ జరగకుండా ఆ అమ్మాయి లో ప్రవేశించిన చంద్రముఖి ప్రయత్నాలు చేస్తుంది. చంద్రముఖి ఎందుకు పూజ జరగకుండా అడ్డుకుంటుంది? అలాగే అసలు వేట రాజు గతం ఏంటి? చంద్రముఖి గతం ఏంటి? వేట రాజు కి చంద్రముఖి కి మధ్య గతంలో ఏం జరిగింది అనే కథ మొత్తాన్ని చంద్రముఖి 2 లో చూపించడం జరిగింది. సీనియర్ హీరోయిన్ రాధిక, లక్షిమీనన్ ,వడివేలు , శత్రు తదితరులు నటించారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు