పీయస్2.. ఓపెనింగే క్లైమాక్స్‌లా ఉంటుందా?
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ ఒన్ చూసిన చాలా మంది అర్థం కాలేదన్నారు. కొందరు చరిత్రను ఇంతకన్నా గొప్పగా ఎలా చెబుతారంటూ మణిరత్నం వైపు నిలుచున్నారు. ఫైనల్‌గా బాక్సాఫీస్ మాత్రం 500 కోట్ల వసూళ్లతో శభాష్ అంది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోనే సెకండ్ పార్టుకు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టి, అంతకు మించి ఉండేలా తెరకెక్కించారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత ధూళిపాళ, నాజర్, ప్రకాష్‌రాజ్, జయరామ్, ఐశ్వర్యలక్ష్మి అంటూ తెరనిండుగా తారాగణంతో తెరకెక్కింది పొన్నియిన్ సెల్వన్2. పార్ట్ ఒన్‌లో ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ, మెట్టుకు మెట్టు అర్థమయ్యేలా చెప్పారు మణిరత్నం. పాత్రల పరిచయాలు, వాటి ఉద్దేశాలు, లక్ష్యాలు ఇప్పుడు జనాలకు తెలుసు కాబట్టి, సెకండ్ పార్టులో అన్నీ విషయాలను అద్భుతంగా చెప్పాలన్నది డైరక్టర్ సంకల్పం.