English | Telugu

పవన్ కళ్యాణ్ ని కాదని రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్'!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో చరణ్ మరోసారి 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో పాన్ ఇండియా సక్సెస్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమాని శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు రివీల్ చేయడం విశేషం.

'దిల్' సినిమాతో నిర్మాతగా మారి ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు.. నిర్మాతగా 20 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల విశేషాలను పంచుకున్న ఆయన.. 'గేమ్ ఛేంజర్' కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. "శంకర్ గారు ఈ కథ చెప్పగానే నాకు నచ్చడంతో.. ఏ హీరోతో చేయాలి అనుకుంటున్నారని అడిగాను. ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వారితో చేయాలనుకుంటున్నాను అన్నారు. లేదు సార్ ఈ కథ చరణ్ కి బాగుంటుందని నేను చెప్పాను. అప్పుడు చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నారు. నేను వెళ్లి చరణ్ ని కలిసి.. శంకర్ గారు ఒక కథ చెప్పారు, చాలా బాగుంది, ఒకసారి వినమని చెప్పాను. కథ విని చరణ్ కూడా వెంటనే ఓకే అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ లాక్ అయింది" అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలా బాబాయ్ దగ్గరకి వెళ్లాల్సిన కథ అబ్బాయి దగ్గరకు వెళ్ళింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.