రంగుల్లో హాయ్ అంటున్న రష్మిక
రష్మిక మందన్న ఇప్పుడు బిజియెస్ట్ స్టార్. దేశంలో ఎన్ని భాషలున్నాయో, అన్నిట్లోనూ సినిమాలు సంతకం చేసినా నేనేం బిజీగా ఉన్నానని అనుకోను అని బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చే మనస్తత్వం నేషనల్ క్రష్ది. ఇండియన్ ఇండస్ట్రీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, మహేష్‌బాబు, అల్లు అర్జున్, విజయ్, విజయ్ దేవరకొండ, కార్తితో పాటు ఇంకా పలువురితో పనిచేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది. ప్రస్తుతం ఆమె దేవ్ మోహన్‌తో రెయిన్బోలో నటిస్తున్నారు.