'దసరా' మూవీ రివ్యూ
'దసరా' ట్రైలర్లో నాని అవతారాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంతదాకా లోకల్ బాయ్‌గా, మన పక్కింటి అబ్బాయిగా కనిపిస్తూ వచ్చిన అతను మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్‌ను, అందులోనూ ఒక మొరటోడి క్యారెక్టర్లో కనిపిస్తున్నాడని అర్థమైంది. అంతకు ముందు వచ్చిన టీజర్, సాంగ్స్‌తో వచ్చిన క్రేజ్, ట్రైలర్ తర్వాత ఇంకో లెవల్‌కు చేరుకుంది.