English | Telugu

వంద కోట్ల క్లబ్ లో 'దసరా'

నేచురల్ స్టార్ నాని వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'దసరా' వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. విడుదలైన మొదటి వారంలోనే దసరా సినిమా ఈ ఫీట్ ని సాధించడం విశేషం.

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దసరా'. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30 న విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టింది. వీక్ డేస్ లోనూ అదే జోరుని కొనసాగిస్తూ మొదటి వారం పూర్తయ్యేసరికి వంద కోట్ల క్లబ్ లో చేరింది.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఏడు రోజుల్లో నైజాంలో రూ.21.49 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.4.98 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.11.74 కోట్ల షేర్ రాబట్టిన దసరా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇప్పటిదాకా రూ.38.21 కోట్ల షేర్ వసూలు చేసింది. కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.7.36 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.9.60 కోట్ల షేర్ కలిపి వరల్డ్ వైడ్ గా వారం రోజుల్లో రూ. 55.17 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఫుల్ రన్ రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.