English | Telugu
'ఆదిపురుష్' కొత్త పోస్టర్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
Updated : Apr 6, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. టి సిరీస్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం అయినప్పటికీ.. ఇప్పటిదాకా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ఏవీ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. అయితే తాజాగా విడుదలైన ఒక పోస్టర్ పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా 'ఆదిపురుష్' నుంచి ఈరోజుఒక కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో హనుమంతుడు రాయిపై కూర్చొని ధ్యానం చేస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీరాముని రూపం కనిపిస్తుంది. పోస్టర్ ను డిజైన చేసిన తీరు బాగుందని, ఇప్పటిదాకా విడుదల చేసిన వాటిలో ఇదే బెస్ట్ పోస్టర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 'ఆదిపురుష్' టీజర్ విడుదలైనప్పుడు హనుమంతుడి వస్త్రధారణ పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కాషాయ వస్త్రం, రుద్రాక్షలు ధరించిన హనుమంతుడి రూపం ఎంతో బాగుందని ప్రశంసలు కురుస్తున్నాయి. మరి 'ఆదిపురుష్' టీమ్ ఇక మీదట కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకొని ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతుందేమో చూద్దాం. ఈ చిత్రం జూన్ 16 న పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల కానుంది.