English | Telugu
దగ్గుబాటి కుటుంబంలో విషాదం!
Updated : Apr 5, 2023
దగ్గుబాటి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు, నిర్మాత దగ్గుబాటి రామమోహనరావు(మోహన్ బాబు) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 73 ఏళ్ళ రామమోహనరావు బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
చిన్న వయసులోనే నిర్మాతగా మారిన రామమోహనరావు 1979లో 'ఒక చల్లని రాత్రి' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఇతరుల భాగస్వామ్యంతో పలు చిత్రాలను నిర్మించారు. నటుడు కొల్లా అశోక్ బాబు సోదరి శారదను రామమోహనరావు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారంచేడు వెళ్లి తన బాబాయ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రామమోహనరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు కారంచేడులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.