English | Telugu
బాక్సాఫీస్ ఊచకోతకు సై అంటున్న 'సలార్'!
Updated : Apr 5, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. 'బాహుబలి' తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించగల సినిమా ఇది అని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి వస్తుందా? లేక వాయిదా పడుతుందా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఆ డౌట్స్ కి చెక్ పెడుతూ ఈ సినిమా సెప్టెంబర్ 28 నే విడుదల అవుతుందని మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
'మోస్ట్ వైలెంట్ మ్యాన్' సెప్టెంబర్ 28, 2023న థియేటర్లలో అడుగు పెడుతున్నాడని తెలుపుతూ సలార్ మేకర్స్ తాజాగా ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'సలార్'తో ప్రభాస్ బాక్సాఫీస్ ఊచకోత కోయడం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. 'బాహుబలి-2' ప్రభాస్, కేజీఎఫ్-2'తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాలను అందుకున్నారు. మరి ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తున్న సలార్ ఇంకెంతటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
హాంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న 'సలార్'లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.