English | Telugu

విజ‌య్ ఇంట్లో లియో షూటింగ్‌

ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న సినిమా లియో. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల  ఈ సినిమా షూటింగ్ క‌శ్మీర్‌లో జ‌రిగింది. ప్ర‌స్తుతం చెన్నైలో షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాను సెవ‌న్ స్క్రీన్ స్టూడియో ప‌తాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. త్రిష‌, ప్రియా ఆనంద్ నాయిక‌లు. అర్జున్‌, సంజ‌య్ ద‌త్‌, గౌత‌మ్ వాసుదేవమీన‌న్‌, మిస్కిన్‌, మ్యాథ్యూ థామ‌స్‌తో పాటు ప‌లువురు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కశ్మీర్‌లో జ‌రిగిన షూటింగ్‌లో మిస్కిన్ పార్ట్ పూర్త‌యింది. చెన్నై షెడ్యూల్‌తో గౌత‌మ్ వాసుదేవ‌మీన‌న్ షెడ్యూల్ పూర్త‌యిపోతుంది. ప్ర‌స్తుతం చెన్నైలో జ‌రుగుతున్న షూటింగ్ పూర్తి కాగానే యూనిట్ మొత్తం హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ హైద‌రాబాద్ అన‌గానే అంద‌రికీ రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తుకొస్తుంది.

త‌న‌కు అడుక్కోవాల్సిన అవ‌స‌రం లేదంటున్న స‌మంత‌

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ సమంత గురించే మాట్లాడుతున్నారు. ఓవైపు శాకుంతలం ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆమె, మరోవైపు ఈ ప్రమోషన్లలోనే నెక్స్ట్ ప్రాజెక్టులు ఖుషి, సిటాడెల్ గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా నార్త్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పారితోషికాల గురించి చాలా విషయాలు మాట్లాడారు. పారితోషికాన్ని  పురుషులతో సమానంగా అందుకోవడానికి తను చాలా కష్టపడుతున్నట్లు తెలిపారు. అయితే తానుప్రత్యక్షంగా కష్టపడుతున్నట్టు అందరికీ చూపిస్తూ ప‌నులు చేయ‌డం లేదని, తను చేస్తున్న పనికి అవతల వాళ్ళు డ‌బ్బు తెచ్చి ఇచ్చే విధంగానే ప్రవర్తిస్తున్నానని అన్నారు. తను అడుక్కోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు. తన పని తీరు తనకు మార్కెట్లో ఒక విలువని క్రియేట్ చేస్తుందని, `మీకు ఇంత ఇద్దాం అనుకుంటున్నాం` అని అవతలి వాళ్ళు చెప్పేలా అది చేస్తుందని, అలాంటి విషయాలు తనకు నమ్మకం ఎక్కువ అని చెప్పారు సమంత.