English | Telugu
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదలైంది!
Updated : Apr 5, 2023
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గత డిసెంబర్ లో లాంచ్ అయింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. దీంతో 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.
నిజానికి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రెండో సినిమా ప్రకటన ఎప్పుడో 2021 లోనే వచ్చింది. అప్పుడు 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ సినిమాని ప్రకటించారు. ఏడాది గడిచిపోయినా ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో అసలు ఆ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే 2022 చివరిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' గా టైటిల్ మార్చి ప్రకటించడంలో ఈ సినిమా ఉందని క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు పట్టాలెక్కింది. దర్శకుడిగా హరీష్ శంకర్ చివరి చిత్రం 'గద్దలకొండ గణేష్' 2019లో విడుదలైంది. పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటన వచ్చి కూడా ఏడాదిన్నర దాటిపోయింది. ఆయన సెట్ లో అడుగుపెట్టి యాక్షన్ చెప్పడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఎదురుచూపులు ఫలించి ఇంత కాలానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ మొదలైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ హరీష్ శంకర్ ట్విట్టర్ లో 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం' సాంగ్ ని పోస్ట్ చేశాడు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడిగా 'ధమాకా' బ్యూటీ శ్రీలీల నటిస్తున్నట్లు సమాచారం.