English | Telugu
పీయస్2.. ఓపెనింగే క్లైమాక్స్‌లా ఉంటుందా?
Updated : Apr 5, 2023
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ ఒన్ చూసిన చాలా మంది అర్థం కాలేదన్నారు. కొందరు చరిత్రను ఇంతకన్నా గొప్పగా ఎలా చెబుతారంటూ మణిరత్నం వైపు నిలుచున్నారు. ఫైనల్‌గా బాక్సాఫీస్ మాత్రం 500 కోట్ల వసూళ్లతో శభాష్ అంది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోనే సెకండ్ పార్టుకు అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టి, అంతకు మించి ఉండేలా తెరకెక్కించారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత ధూళిపాళ, నాజర్, ప్రకాష్‌రాజ్, జయరామ్, ఐశ్వర్యలక్ష్మి అంటూ తెరనిండుగా తారాగణంతో తెరకెక్కింది పొన్నియిన్ సెల్వన్2. పార్ట్ ఒన్‌లో ఒక్కో పాత్రను పరిచయం చేసుకుంటూ, మెట్టుకు మెట్టు అర్థమయ్యేలా చెప్పారు మణిరత్నం. పాత్రల పరిచయాలు, వాటి ఉద్దేశాలు, లక్ష్యాలు ఇప్పుడు జనాలకు తెలుసు కాబట్టి, సెకండ్ పార్టులో అన్నీ విషయాలను అద్భుతంగా చెప్పాలన్నది డైరక్టర్ సంకల్పం.
అందుకే సెకండ్ పార్ట్ ఓపెనింగ్ సీన్‌నే క్లైమాక్స్ లా ఉండేలా తెరకెక్కించారట. ప్రేక్షకులు శ్వాస తీసుకోవడానికి కూడా వీలులేనంత స్టఫ్డ్ గా సెకండ్ పార్ట్ ఉంటుందట. ఎక్కడా కనురెప్ప వేయడానికి వీలులేనంత టైట్ స్క్రీన్‌ప్లేతో సెకండ్ పార్టుని దట్టించారట. చోళ సామ్రాజ్యంలో తలెత్తిన రాజకీయాలు, వాటికి ఆదిత్య చోళుడు ఎలా అధిగమించాడు? పొన్నియిన్ సెల్వన్ కన్నుమూశాడా? తన రాజ్యానికి తిరిగి వచ్చాడా? అతని కోసం ఎదురుచూసిన అతివ మనసు ఏమయింది? వందియదేవన్ వల్లవరాయన్‌కి కుందవై శరణు పలికిందా? పాండ్యరాజుల ప్రతాపం ఏమైంది? ఇలా ఎన్నో వందల ప్రశ్నలకు సెకండ్ పార్టులో సమాధానం ఉందట. ఏప్రిల్ 28న విడుదల కానుంది పీయస్2. ఇటీవల ట్రైలర్‌ని వైభవంగా విడుదల చేశారు. చోళరాజుల చరిత్ర, తమిళ మన్నుకు సంబంధించిన చరిత్ర అంటూ పీయస్2 కోసం వెయిట్ చేస్తున్న విధానం గురించి నెట్టింట్లో పరిపరివిధాలా తమ సందేశాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.