English | Telugu

రాజమౌళి చిత్రంలో హ‌నుమంతుడి ల‌క్ష‌ణాల‌తో మ‌హేష్ కేర‌క్ట‌ర్‌!

2023లో ఒక్క రిలీజ్ కూడా లేదు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్‌బాబుకి. మిగిలిన హీరోలంద‌రూ ఆస్కార్‌ల‌నీ, వ‌రుస రిలీజుల‌ని, ఓపెనింగ్‌ల‌నీ సంద‌డి చేస్తుంటే, మా బాబు సినిమా అప్‌డేట్స్ ఏవీ... అంటూ దిగులుప‌డుతున్నారు ఫ్యాన్స్. స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో ఉన్నారు ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్‌బాబు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో మూవీ చేస్తున్నారు మ‌హేష్‌బాబు. ఈ సినిమాలోనే బ్రేక్ తీసుకుని ఫారిన్ ట్రిప్ వెళ్లారు. ఈ సినిమాలో మ‌హేష్ తో మ‌రోసారి జోడీ క‌డుతున్నారు పూజా హెగ్డే. 2024 స‌మ్మ‌ర్‌కి షెడ్యూల్‌ని ఫిక్స్ చేసుకుంది ఈ సినిమా.

ర‌జ‌నీకాంత్‌తో దిల్‌రాజు మూవీ!

దిల్‌రాజు ప్లానింగ్ మామూలుగా లేదు. నిన్న‌మొన్న‌టిదాకా తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిమిత‌మైన దిల్‌రాజు ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో పావులు క‌దుపుతున్నారు. వ‌చ్చీరాని త‌మిళ్‌లో వారిసు స్టేజ్ మీద త‌మిళ ఆడియ‌న్స్‌ని అట్రాక్ట్ చేసిన దిల్‌రాజు ఇప్పుడు కంప్లీట్‌గా త‌మిళ్ నేర్చుకుంటున్నారు. ఆయ‌న నిర్మాణంలో ఓ జ‌బ‌ర్ద‌స్త్ మూవీ రాబోతోంది. 50 సినిమాల నిర్మాత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్నారు దిల్‌రాజు. ఇటీవ‌ల త‌మిళ సినిమా వారిసును నిర్మించారు. ఈ సినిమాకు అక్క‌డ మంచి ఓపెనింగ్స్, క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో హిట్ కొట్టిన దిల్‌రాజు, సీస‌లైన ద‌ళ‌ప‌తి ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.