సమంత చేయాల్సిన 'రెయిన్ బో' రష్మిక చేస్తుందా!
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో అలరించే హీరోయిన్లు అరుదుగా ఉంటారు. ఈ తరంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న హీరోయిన్లు అంటే అనుష్క, సమంత పేర్లు ముందుగా గుర్తుకొస్తాయి. 'అరుంధతి', 'భాగమతి', 'రుద్రమదేవి' వంటి సినిమాలతో అనుష్క ఆకట్టుకోగా.. 'ఓ బేబీ', 'యూ టర్న్', 'యశోద' వంటి సినిమాలతో సమంత అలరించింది.