English | Telugu
ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ ఫిల్మ్ ఏమయ్యింది?
Updated : Apr 6, 2023
'వార్', 'పఠాన్' సినిమాల డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ బాలీవుడ్ ఫిల్మ్ చేయనున్నాడని కొంతకాలంగా రిపోర్టులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌తో సినిమా చేయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్‌లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నించింది. సిద్ధార్థ్ ఆనంద్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి కనపర్చాడు కూడా. ఇటీవల హృతిక్, ప్రభాస్ కాంబినేషన్‌లో 'వార్ 2' చేయడానికి సిద్ధార్థ్ ఆనంద్ రెడీ అవుతున్నాడని, దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని కూడా ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఇప్పుడు అదంతా మారిపోయింది. 'వార్ 2'లో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారనీ, ఆ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా 'బ్రహ్మాస్త్ర' ఫేం అయన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తాడనీ బుధవారం బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. అది అఫిషియల్ అని కూడా ఆయన పేర్కొన్నాడు.
బాలీవుడ్‌లో 'పఠాన్' సరికొత్త రికార్డులు నెలకొల్పడంతో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే అతను హృతిక్ రోషన్, దీపికా పడుకోనే జంటగా 'ఫైటర్' మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత 'టైగర్ వర్సెస్ పఠాన్' మూవీని డైరెక్ట్ చేయడానికి ఇటీవలే అతను సంతకం చేశాడు. ఇందులో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించనున్నారు. ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్నది. 2014 జనవరిలో షూటింగ్ మొదలవుతుంది.
మరోవైపు ప్రభాస్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'ప్రాజెక్ట్ కే', 'సలార్', మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఉన్నాయి. వీటి తర్వాత సందీప్ వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్' సినిమా చేయడానికి అతను అంగీకరించాడు. కాబట్టి ఇప్పట్లో ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ మూవీ సాధ్యమయ్యే అవకాశం లేదు.