English | Telugu

ధ‌నుష్ - మారి సెల్వ‌రాజ్ కొత్త సినిమా షురూ

త‌మిళ్ సినిమా ఇండ‌స్ట్రీలో అన్ని ర‌కాల పాత్ర‌ల‌కూ ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోయే న‌టుల్లో ముందు వ‌రుస‌లో ఉంటారు ధ‌నుష్‌. ఇటీవ‌ల సార్‌తో పెద్ద హిట్ కొట్టిన ధ‌నుష్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. మిగిలిన హీరోలంద‌రూ ప్యాన్ ఇండియా రేంజ్ గురించి ఆలోచిస్తుంటే, ఏకంగా ఇంట‌ర్నేష‌న‌ల్ డ‌యాస్ మీద పంచెక‌ట్టుతో కూర్చున్న హీరో ధ‌నుష్‌. ఓ వైపు న‌టుడిగా క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నప్ప‌టికీ, నిర్మాత‌గా కూడా ఎప్పుడూ ముందుండాల‌ని అనుకుంటారు ఈ హీరో. లేటెస్ట్ గా ఆయ‌న మారి సెల్వ‌రాజ్ సినిమాకు సంత‌కం చేశారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సౌత్ నిర్మిస్తోంది. వండ‌ర్ బార్ ఫిల్మ్స్ కూడా నిర్మిస్తోంది.

వ‌రుణ్‌ధావ‌న్‌తో ర‌వితేజ‌... నార్త్ లో వైర‌ల్ అవుతున్న సౌత్ హీరోలు!

నిన్న‌టిదాకా స‌క్సెస్ స్ట్రీక్ మీదున్నారు ర‌వితేజ‌. లేటెస్ట్ గా ఆయ‌న న‌టించిన రావ‌ణాసుర విడుద‌లైంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తోంది. కానీ నార్త్ లో మాత్రం ర‌వితేజ పేరు గ‌ట్టిగానే ట్రెండ్ అవుతోంది. ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య‌తో హిట్ ట్రాక్ లోకి వ‌చ్చారు ర‌వితేజ‌. రావ‌ణాసుర కూడా 100 కోట్ల క్ల‌బ్‌లోకి చేరుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. శింబు న‌టించిన మానాడు సినిమా రీమేక్‌లో వ‌రుణ్‌ధావ‌న్‌తో పాటు ర‌వితేజ కూడా న‌టిస్తార‌న్న‌ది లేటెస్ట్ న్యూస్‌. ఈ సినిమాను తెలుగులోనూ, హిందీలోనూ తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. త‌మిళ్‌లో ఈ సినిమాలో  శింబు, ఎస్‌జె సూర్య క‌లిసి నటించారు.

కియార‌కు మేక‌ప్ అవ‌స‌ర‌మే లేదా?

ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌. మొన్న‌టికి మొన్న కియారా అద్వానీ కశ్మీర్ నుంచి ఫొటోలు పెడుతుంటే, అంద‌రూ భ‌ర్త సిద్ధార్థ్‌తో క‌లిసి ట్రిప్‌కి వెళ్లారేమో అనుకున్నారు. అయితే కియారా వెళ్లింది ట్రిప్ కి కాద‌ని, ఆమె వ‌ర్క్ మోడ్‌లో ఉన్నార‌ని అర్థ‌మైంది. కియారా అద్వానీ, కార్తిక్ ఆర్య‌న్ క‌లిసి హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. స‌త్య‌ప్రేమ్‌కి క‌థ అనే ఆ సినిమాను ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌రిస్తున్నారు. మంచు కొండ‌ల్లో, మంచు నిండిన సోన్ మార్గ్ లో ఈ సినిమాకు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు మేక‌ర్స్. అక్క‌డ ప‌నిలో ప‌నిగా షూటింగ్ చేస్తూనే, ఫొటో షూట్లు కూడా బాగానే చేశారు కియారా అద్వానీ. ఈ స‌త్య ప్రేమ్ కి క‌థ  క‌శ్మీర్ షెడ్యూల్ పూర్తి కావ‌డంతో ముంబైకి తిరిగి వ‌చ్చారు. రిట‌ర్న్ జ‌ర్నీలో కియారాతో పాటు ముంబై ఎయిర్‌పోర్టులో దిగారు కార్తిక్ ఆర్య‌న్‌.  

జీడీ నాయుడు కేర‌క్ట‌ర్‌లో ఆర్ మాధ‌వన్‌!

ఇండియ‌న్ ఇన్వెంట‌ర్‌, ఇంజినీర్ గోపాల‌స్వామి దురైస్వామి నాయుడు (జీడీ నాయుడు) జీవితం ఆధారంగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఆయ‌న పాత్ర‌లో న‌టించ‌డానికి ఓకే చెప్పేశారు వెర్స‌టైల్ యాక్ట‌ర్ ఆర్ మాధ‌వ‌న్‌. ఇటీవ‌ల రాకెట్రీ నంబి కేర‌క్ట‌ర్‌లో న‌టించారు మాధ‌వ‌న్‌. ఆ సినిమాకు ఇంకా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంత‌లోనే మ‌రో రియ‌ల్ లైఫ్ కేర‌క్ట‌ర్‌కి ఓకే చెప్పేశారు ఆర్‌.మాధ‌వ‌న్‌. ఎడిస‌న్ ఆఫ్ ఇండియా అనే పేరుంది జీడీ నాయుడికి. ఇండియాలో ఫ‌స్ట్ ఎల‌క్ట్రిక్ మోట‌ర్ క‌నిపెట్టిన ఘ‌న‌త ఆయ‌న‌దే. మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, అగ్రిక‌ల్చ‌ర్ రంగాల‌కు త‌న‌దైన సేవ చేసిన ఘ‌న‌త జీడీ నాయుడు సొంతం. గ‌తంలో 2019లో జీడీ నాయుడు - ది ఎడిస‌న్ ఆఫ్ ఇండియా పేరు మీద ఫిల్మ్ డివిజ‌న్ ఆఫ్ ఇండియా చేసిన బ‌యోపిక్‌కి బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ ఫిల్మ్ అవార్డు కేట‌గిరీలో 66వ జాతీయ పుర‌స్కారాల్లో ఉత్త‌మ బ‌హుమ‌తి ద‌క్కింది.

రోమాంచమ్ మూవీ రివ్యూ

ఒక అతను హాస్పిటల్ లో బెడ్ మీద ఉండి అంతా చూస్తుంటాడు. కానీ అతనికి ఏమీ సరిగ్గా కనిపించదు. డాక్టర్ వచ్చి అతడిని చూసి నువ్వు కోమాలోకి వెళ్ళావ్.. ఇప్పుడు లేచావని అతనితో చెప్పగా అవునా అని షాక్ లో ఉంటాడు. కోమాలోంచి లేచిన అతను జీవన్(సౌబిన్ షాహిర్).. జీవన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడాలని డాక్టర్ కి చెప్పగా ... నువ్వు ఇంకా ఐసీయూలోనే ఉన్నావని, నిన్ను జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసాక నీ స్నేహితులని కలవొచ్చని చెప్తాడు. అలా కాదు డాక్టర్ నేనిప్పుడే వాళ్ళని కలవాలని కోరగా..‌ అయితే ఆ గోడకి ఉన్న ఫోటో ఫ్రేం ఎవరిదో సరిగ్గా చెప్తే మీ ఫ్రెండ్స్ ని కలవొచ్చని డాక్టర్ చెప్తాడు. కానీ అతనికి సరిగ్గా కనిపించదు. దాంతో అది తెలుసుకోమని డాక్టర్ చెప్పగా..

అదితిరావు హైద‌రీని సిద్ధార్థ్ ఏమ‌ని పిలుస్తారో తెలుసా?

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయే న‌ట‌నను క‌న‌బ‌రిచారు అదితిరావు హైద‌రీ. ఆమె సెల‌క్ట్ చేసుకునే పాత్ర‌ల‌ను బ‌ట్టే, ఆమె ఎంత సున్నిత‌మ‌న‌స్కురాలో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అంటుంటారు ఫిల్మ్ క్రిటిక్స్. ఆల్రెడీ పెళ్ల‌యి డైవ‌ర్స్ తీసుకుని ఒంట‌రిగా ఉంటున్నారు అదితిరావు హైద‌రీ. ఇప్పుడు ఆమె సిద్ధార్థ్‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ విష‌యాన్ని అదితి, సిద్ధార్థ్ ఇప్ప‌టిదాకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. కానీ, వాళ్లిద్ద‌రూ త‌ర‌చూ కలిసి క‌నిపిస్తుండ‌టంతో ఈ విష‌యం గురించి నార్త్ టు సౌత్ అంత‌టా డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఓ సంద‌ర్భంగా సిద్ధార్థ్ త‌న ప్రేయ‌సిని ముద్దుపేరుతో పిలిచారు. అదేంటన్న‌దే ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న విష‌యం. త‌న జూబ్లీ ప్రీమియ‌ర్‌కు వ‌చ్చిన ఫ్రెండ్స్ అంద‌రితో క‌లిసి అదితిరావు హైద‌రీ ఓ ఫొటో తీసుకుని నెట్లో షేర్ చేశారు. అందులో సిద్ధార్థ్ కూడా ఉన్నారు.