English | Telugu

'బ్రో'కి అక్రమ ఫండింగ్ జరిగిందంటూ.. ఢిల్లీలో ఫిర్యాదు చేయనున్న అంబటి!

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'బ్రో' అక్రమ ఫండింగ్ తో తెరకెక్కిందంటూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై వైసీపీ ఎంపీలతో కలిసి అంబటి ఈ రోజు రాత్రి ఢిల్లీలో ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. ఇందులో భాగంగానే 'బ్రో' చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎన్నారైల నుండి డబ్బులు సేకరించి.. ఆ నగదుని సినిమా పేరుతో పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నారని రాంబాబు ఆరోపించారు. ఈ క్రమంలోనే 'బ్రో'కి అక్రమ ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగాయని.. ఈ విషయాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేయనున్నారు.  

ఇళ‌య‌రాజా బ‌యోపిక్‌లో ధ‌నుష్‌?

కొన్ని మాట‌లు విన‌డానికి కూడా చాలా చాలా ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తాయి. అలాంటి ఓ మాటే ఇళ‌యారాజా బ‌యోపిక్‌లో ధ‌నుష్ హీరోగా న‌టిస్తారు అనేది. ధ‌నుష్ ప్ర‌స్తుతం చేతినిండా సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టించిన వాత్తి, సార్ సినిమాలు త‌మిళ్‌, తెలుగులో చాలా మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాయి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. క‌రెక్టుగా ఈ టైమ్‌లోనే ఇళ‌య‌రాజా బ‌యోపిక్‌లో ధ‌నుష్ న‌టిస్తున్నార‌నే  మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ ఆర్‌. బాల్కీతో ధ‌నుష్‌కి ఎప్పుడూ మంచి కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్ అవుతుంది. వారిద్ద‌రు క‌లిసి చేసిన ష‌మితాబ్ హిట్ అయింది. ఇప్పుడు ఇసైజ్ఞాని ఇళ‌య‌రాజా బ‌యోపిక్ గురించి క‌ల‌లు కంటున్న‌ది కూడా బాల్కీనే. ఆయ‌న‌కు ధ‌నుష్ తో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ తీయాల‌ని ఉంద‌ట‌.

శివ‌రాజ్‌కుమార్ హీరోగా పృథ్విరాజ్ సినిమా!

ఇండ‌స్ట్రీలో గొప్ప పేరున్న ఇద్ద‌రు స్టార్లు క‌లిసి సినిమా చేస్తార‌నే వార్త‌లు సౌత్ ఇండియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ విష‌యం తెలిసిన‌ప్పటి నుంచి ఫ్యాన్స్ ఎగ్జ‌యిటింగ్ మామూలుగా లేదు. మ‌ల‌యాళం స్టార్ పృథ్విరాజ్ సుకుమార‌న్ న‌టుడిగా ఎంత ఫేమ‌స్సో, ద‌ర్శ‌కుడిగానూ అంతే ఫేమ‌స్ అయ్యారు. ఆయ‌న ప్ర‌స్తుతం స‌లార్‌లో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఆయ‌న న‌టించే సినిమాలో శివ‌రాజ్‌కుమార్ కూడా కీ రోల్ చేస్తార‌ట. ఈ విష‌యం గురించి ఇటీవ‌ల శివ‌రాజ్‌కుమార్ ఓపెన్ అయ్యారు. ``త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అనౌన్స్ మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది`` అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.