English | Telugu
ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్?
Updated : Aug 2, 2023
కొన్ని మాటలు వినడానికి కూడా చాలా చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. అలాంటి ఓ మాటే ఇళయారాజా బయోపిక్‌లో ధనుష్ హీరోగా నటిస్తారు అనేది. ధనుష్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన వాత్తి, సార్ సినిమాలు తమిళ్, తెలుగులో చాలా మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. కరెక్టుగా ఈ టైమ్‌లోనే ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్ నటిస్తున్నారనే మాటలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఆర్. బాల్కీతో ధనుష్‌కి ఎప్పుడూ మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుంది. వారిద్దరు కలిసి చేసిన షమితాబ్ హిట్ అయింది. ఇప్పుడు ఇసైజ్ఞాని ఇళయరాజా బయోపిక్ గురించి కలలు కంటున్నది కూడా బాల్కీనే. ఆయనకు ధనుష్ తో ఇళయరాజా బయోపిక్ తీయాలని ఉందట.
బాల్కీ ఇటీవల తన ఘూమర్ ప్రమోషన్లలో మాట్లాడుతూ ``ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్ చేయాలన్నదే నా డ్రీమ్. నాకు ధనుష్‌లో రాజా సార్ కనిపిస్తారు. నాకు ధనుష్ ఫేస్, అలాగే అనిపిస్తుంది. కంపోజర్‌గా, లిరిసిస్ట్ గా, సింగర్‌గా వెయ్యికి పైగా సినిమాలకు పనిచేశారు ఇళయారాజా. ఆయన కెరీర్ స్పాన్ ఐదు దశాబ్దాలు. లండన్ ఆర్కెస్ట్రాలో సింఫనీ స్కోర్ చేసిన ఫస్ట్ ఏషియన్ ఆయనే. ధనుష్‌కి ఇప్పుడు 40 ఏళ్లు. ఈ సందర్భంగా నేను చెబుతున్నది ఒక్కటే. నేను ఎప్పటికైనా ఆయనతో ఇళయరాజా సార్ బయోపిక్ తీస్తే, అదే నేను ధనుష్‌కి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్. ఎందుకంటే ఇళయరాజా సార్‌కి ధనుష్ కూడా చాలా పెద్ద ఫ్యాన్`` అని అన్నారు. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ పనుల్లో ఉన్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్ కీ రోల్‌లో నటిస్తున్న ఆ సినిమా డిసెంబర్ 15న విడుదల కానుంది. దాంతో పాటు డీ50 కూడా సెట్స్ మీదుంది. సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ధనుష్, అమలాపాల్, అపర్ణ బాలమురళి, దుషారా విజయన్, అనిఖా సురేంద్రన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ఎస్.జె.సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.