English | Telugu

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. నిహారికతో తరుణ్ పెళ్లి.. ఇంతలోనే ట్విస్ట్!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లో తరుణ్ ఒకరు. ఇప్పుడు ఆయన వయస్సు 40 ఏళ్ళు. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోగా మారిన తరుణ్ 'నువ్వే కావాలి', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' వంటి సినిమాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆయన ప్రేమ, పెళ్లికి సంబంధించి అప్పట్లో రకరకాల వార్తలు వినిపించేవి. కొన్నేళ్లుగా సినిమాలు చేయకపోవడంతో ఈమధ్య ఆయన పెద్దగా వార్తల్లో లేరు. అయితే ఉన్నట్టుండి తరుణ్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కూడా ఇటీవల విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక తో తరుణ్ పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ ఇచ్చారు.

'నిహారిక తో తరుణ్ పెళ్లి ఫిక్సయింది' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద స్పందించిన ఆయన.. ఈ ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని తరుణ్ అన్నారు. మొత్తానికి తరుణ్ మాటలను బట్టి చూస్తే నిహారికతో అనే కాదు, అసలు ఇప్పట్లో ఆయన పెళ్లి లేనట్లే అని చెప్పాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.