English | Telugu
పూరీకి బీచ్ పిచ్చి .. మరి బోయపాటికి..!
Updated : Aug 3, 2023
ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అదికాస్త మోతాదు మించితే క్రేజీగా కూడా అనిపిస్తుంటుంది. అలా క్రేజీగా చూసే విషయాల్లో.. పూరీ జగన్నాథ్ 'బీచ్' సెంటిమెంట్ ఒకటి. 'ఇడియట్' నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వరకు పూరీ డైరెక్ట్ చేసిన సినిమాల్లో 'బీచ్' బ్యాక్ డ్రాప్ సాంగ్ ఒకటి పక్కాగా ఉంటుంటుంది. అలా పూరీ తీసిన బీచ్ సాంగ్స్ చాలా వరకు క్లిక్ అయ్యాయి కూడా.
పూరీకి బీచ్ సెంటిమెంట్ ఉన్నట్లే.. మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే.. పబ్/ పార్టీ సాంగ్. తన తొలి చిత్రం 'భద్ర' నుంచి ఏదో ఒక సందర్భంలో ఈ తరహా పాటని టచ్ చేస్తుంటాడు బోయపాటి. మొదటి సినిమా 'భద్ర'లో "ఏ ఊరే చినదానా", 'తులసి'లో "నే చుక్ చుక్ బండినిరో", 'సింహా'లో "ఓరబ్బా", 'లెజెండ్'లో "లస్కు టప", 'సరైనోడు'లో "ప్రైవేట్ పార్టీ", 'జయ జానకి నాయక'లో "ఎ ఫర్ ఆపిల్", 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్'.. ఇలా పబ్/ పార్టీ నేపథ్యంలో సాగే సాంగ్సే. కట్ చేస్తే.. తాజా చిత్రం 'స్కంద'లోనూ ఈ తరహా గీతానికి చోటిచ్చాడు బోయపాటి. ఫస్ట్ సింగిల్ గా వదిలిన "నీ చుట్టు చుట్టు" అనే ఈ పాట పబ్ నేపథ్యంలో సాగే పాటనే కావడం విశేషం. మొత్తానికి పూరీకి బీచ్ నేపథ్యంలో సాగే సాంగ్స్ సెంటిమెంట్ అయితే.. బోయపాటికి పబ్/ పార్టీ సాంగ్స్ అలాగేనన్నమాట. మరి.. ఈ సెంటిమెంట్ ని మున్ముందు కూడా కొనసాగిస్తారేమో చూడాలి.