English | Telugu
సర్దార్ సీక్వెల్ పనులు షురూ చేసిన కార్తి
Updated : Aug 2, 2023
కార్తి సర్దార్ సీక్వెల్‌కి సంబంధించిన పనులు షురూ అయ్యాయి. ఈ సారి టెక్నీషియన్లలోనూ మేజర్ మార్పులు కనిపిస్తున్నాయి. కార్తి హీరోగా డైరక్టర్ మిత్రన్ తెరకెక్కించిన సినిమా సర్దార్. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. సర్దార్ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2కి సంబంధించి హింట్ ఇచ్చారు. దానికి తగ్గట్టే ఇప్పుడు సీక్వెల్ పనులు మొదలయ్యాయనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయట. ఈ ఏడాదే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తోంది టీమ్. సర్దార్‌కి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.
ఇప్పుడు సీక్వెల్‌కి యువన్ శంకర్ రాజా ఆన్ బోర్డ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే నిజమైతే కార్తి, మిత్రన్, యువన్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా సర్దార్2 అవుతుంది. ఇంతకు ముందు ఇదే కాంబినేషన్‌లో ఇరుంబు తిరై, హీరో సినిమాలు తెరకెక్కాయి. సర్దార్‌లో రెండు రోల్స్ చేశారు కార్తి. అందులో ఒకటి సర్దార్ అలియాస్ చంద్రబోస్, రెండో కేరక్టర్ విజయ్ ప్రకాష్. చుంకీ పాండీ, రాశీఖన్నా, రజీషా విజయన్ ఇతర పాత్రల్లో కనిపించారు. సీనియర్ యాక్ట్రెస్ లైలా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో నటించారు. ప్రస్తుతం కార్తి జపాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. రాజా మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. దీపావళికి విడుదల చేయాలన్నది ప్లాన్. ఇందులోనూ కార్తి డ్యూయల్ రోల్ చేశారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఫిలోమిన్ రాజ్ జపాన్‌కి ఎడిటర్.