English | Telugu
మెగా మల్టీస్టారర్: విక్రమ్‌తో సేతుపతి
Updated : Aug 2, 2023
మెగా మల్టీస్టారర్‌లో నటించడానికి విక్రమ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆయనతో పాటు విజయ్ సేతుపతి ఇంకో హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. ప్రతి నెలా ఏదో ఓ సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను కూడా నిర్మించడానికి ముందుకు వచ్చింది. జూడ్ ఆంటనీ జోసెఫ్ ఈ సినిమాకు డైరక్షన్ చేస్తున్నారు. జూడ్ ఆంటనీ జోసెఫ్ అనగానే అందరికీ 2018 సినిమా గుర్తుకొస్తుంది. కేరళ ఫ్లడ్స్‌ని బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా 2018. ఈ సినిమా మలయాళ సినిమా ఇండస్ట్రీలో 200 కోట్ల మార్కు టచ్ చేసిన సినిమా. తమిళ్, తెలుగు, హిందీలో డబ్ అయి చాలా మంచి వసూళ్లు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ సినిమాగా పేరు తెచ్చుకుంటోంది. మలయాళం టాప్ ఆర్టిస్టులు టొవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచకో బొబ్బన్, నరేన్, లాల్, వినీత్ శ్రీనివాసన్, సుధీష్, అజు వర్గీస్, అపర్ణ బాలమురళి, తన్వి రామ్, శివడ, గౌతమ్ నాయర్, సిద్ధిఖీ కీ రోల్స్ చేశారు.
విక్రమ్, విజయ్ సేతుపతి నటించే ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్‌ని ట్రై చేస్తున్నారు మేకర్స్. మాలీవుడ్ సూపర్‌స్టార్ నివిన్ పాలీ కూడా ఈ సినిమాలో నటిస్తారని టాక్. రష్మిక మందన్నని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగి, అందరు స్టార్లూ కాల్షీట్ కేటాయిస్తే 2024లో మాంచి మల్టీస్టారర్ అవుతుందని అంటున్నారు క్రిటిక్స్. ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ కావాల్సిన నటీనటులందరూ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.