సూర్య వర్సెస్ దుల్కర్... లేడీ మల్టీస్టారర్!
లేడీ డైరక్టర్లు ఒక్క స్టార్ హీరోనే హ్యాండిల్ చేయడం కష్టం అనే మాట ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మాధవన్, వెంకటేష్, సూర్యతో సినిమాలు చేసి, తన సత్తా ప్రూవ్ చేసుకున్నారు సుధ కొంగర. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌తోనూ సినిమా చేస్తున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమా హిందీ వెర్షన్ కంప్లీట్ కాగానే, సౌత్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేస్తున్నారు సుధ కొంగర. సూరరై పోట్రు సినిమాతో సూర్య బ్యానర్‌ని నేషనల్ అవార్డుల లిస్టులో నిలబెట్టిన ఘనత ఆమెది.