English | Telugu

హైదరాబాద్ లో 'పుష్ప'.. 'దేవర'కి పోటీ కానుందా!

"తగ్గేదేలే" అంటూ 'పుష్ప - ది రైజ్'(2021)తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం 'పుష్ప - ది రూల్'తో అంతకుమించి ఫలితం అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈ నెల 5 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని.. ఇవి సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని బజ్. కాగా, ఈ సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ ప్రథమార్ధంలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే.. ఏప్రిల్ 5న రాబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'దేవర'కి 'పుష్ప - ది రూల్' పోటీ ఇవ్వబోతున్నట్లే. త్వరలోనే 'పుష్ప - ది రూల్' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.