English | Telugu
శివరాజ్‌కుమార్ హీరోగా పృథ్విరాజ్ సినిమా!
Updated : Aug 2, 2023
ఇండస్ట్రీలో గొప్ప పేరున్న ఇద్దరు స్టార్లు కలిసి సినిమా చేస్తారనే వార్తలు సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎగ్జయిటింగ్ మామూలుగా లేదు. మలయాళం స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ నటుడిగా ఎంత ఫేమస్సో, దర్శకుడిగానూ అంతే ఫేమస్ అయ్యారు. ఆయన ప్రస్తుతం సలార్‌లో నటిస్తున్నారు. త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. ఆయన నటించే సినిమాలో శివరాజ్‌కుమార్ కూడా కీ రోల్ చేస్తారట. ఈ విషయం గురించి ఇటీవల శివరాజ్‌కుమార్ ఓపెన్ అయ్యారు. ``త్వరలోనే దీనికి సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది`` అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
శివరాజ్‌కుమార్ ఇప్పుడు జస్ట్ కన్నడ సినిమాలు మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. ఆయన ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న జైలర్‌లోనూ కీ రోల్ చేశారు. రజనీకాంత్‌ని చూస్తుంటే, మాట్లాడుతుంటే, తన తండ్రితో ఉన్నట్టే ఉందని అన్నారు. దాదాపు 12 నిమిషాల పాటు జైలర్‌లో తన పార్ట్ ఉంటుందని చెప్పారు. ధనుష్ నటించే కెప్టెన్ మిల్లర్‌లోనూ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు శివరాజ్‌కుమార్.
మలయాళం ఆర్టిస్టులతో నటించడం కూడా శివరాజ్‌కుమార్‌కి కొత్తేం కాదు. జైలర్‌లోనూ మోహన్‌లాల్‌తో కలిసి నటించారు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ రోల్స్ చేయడానికి తాను రెడీగా ఉన్నట్టు, అన్ని భాషల్లో ఉన్న ఫ్యాన్స్ నీ ఎంగేజ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు శివరాజ్‌కుమార్. కన్నడలోనూ శివరాజ్‌కుమార్‌కి చేతినిండా సినిమాలున్నాయి. అయినా స్పాన్ పెంచుకోవాలన్న తపనతో కృషి చేస్తున్నారు కన్నడ సూపర్‌స్టార్.