English | Telugu
సమంత కాదు.. టిల్లు సరసన రష్మిక.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Updated : Aug 2, 2023
'డీజే టిల్లు' సినిమాతో యువతకు ఎంతగానో చేరువైన సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న 'టిల్లు స్క్వేర్'లో నటిస్తున్నాడు. అయితే దీని తర్వాత అతను చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. నందినిరెడ్డి దర్శకత్వంలో సమంతతో కలిసి ఓ సినిమా చేయనున్నాడని ఆమధ్య వార్తలొచ్చాయి. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న సినిమాలో నటించే అవకాశం రాగా, ఏవో కారణాల వల్ల సిద్ధు ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో రష్మిక మందన్నతో జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సిద్ధు-రష్మిక కలిసి నటించనున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరో తెలిస్తే సర్ ప్రైజ్ అవుతారు.
క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. ఎన్నో చిత్రాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నీరజ.. తిక్క, చల్ మోహన రంగా, మిస్ ఇండియా వంటి చిత్రాలకు గేయ రచయిత్రి గానూ పనిచేశారు. ఇప్పుడామె మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఇప్పటికే సిద్ధుతో కథా చర్చలు పూర్తయ్యాయని, ఇందులో సిద్ధు సరసన రష్మిక హీరోయిన్ గా నటించనుందని సమాచారం. సమంతకు వ్యక్తిగత స్టైలిస్ట్ గా పనిచేసిన నీరజ, ఆమెతో ఉన్న అనుబంధంతో ముందుగా సమంతతోనే ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారట. అయితే సమంత ఆరోగ్యం దృష్ట్యా నటనకు కాస్త విరామం ఇవ్వడంతో రష్మికను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మిథున్ చైతన్య కథ అందిస్తున్నారట. ఇది థ్రిల్లర్ అంశాలతో కూడిన రొమాంటిక్ స్టొరీ అని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వంటి బడా టెక్నీషియన్స్ కి రంగంలోకి దింపుతున్నారట. త్వరలోనే ఈ చిత్ర అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.