English | Telugu
సిద్ శ్రీరామ్ నోట పబ్ పాట.. రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ నెక్స్ట్ లెవల్!
Updated : Aug 3, 2023
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'స్కంద'. ఇందులో రామ్ కి జోడీగా క్రేజీ బ్యూటీ శ్రీలీల సందడి చేయనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, గురువారం (ఆగస్టు 3) ఉదయం 'స్కంద' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. "నీ చుట్టు చుట్టు తిరిగినా" అంటూ మొదలయ్యే ఈ పాట.. పబ్ నేపథ్యంలో సాగుతుంది. మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న సిద్ శ్రీరామ్ నోట వచ్చిన ఈ పబ్ పాట.. ట్రెండీగా సాగుతూ యూత్ ని ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్ శ్రీలీలని ఫ్లర్ట్ చేస్తూ హీరో రామ్ పాడే పాట ఇదని లిరికల్ వీడియోని బట్టి స్పష్టమవుతోంది. రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ ఈ సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. రఘురామ్ సాహిత్యమందించిన ఈ డ్యాన్స్ ఓరియెంటెడ్ పాటని సిద్ తో పాటు సంజన కల్మంజే గానం చేసింది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించాడు. మరి ఫస్ట్ సింగిల్ తో ఇంప్రెస్ చేసిన 'స్కంద' టీమ్.. రాబోయే పాటలతోనూ ఆకట్టుకుంటుందేమో చూడాలి.
కాగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న 'స్కంద'.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న జనం ముందుకు రానుంది.