English | Telugu
'జైలర్' ట్రైలర్.. సూపర్ స్టార్ ఫుల్.. తమన్నా నిల్
Updated : Aug 2, 2023
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలర్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా శివరాజ్‌కుమార్, మోహన్ లాల్ అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి కావాలా సాంగ్ విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆగస్టు 10న విడుదల కానున్న ఈ సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది.
'జైలర్' ట్రైలర్ ను ఈరోజు(ఆగస్టు 2) సాయంత్రం విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లో సూపర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్, మ్యానరిజమ్స్ హైలైట్ గా నిలిచాయి. మొదట్లో సైలెంట్ గా పిల్లిలా కనిపించే రజనీ, ఆ తర్వాత వైలెంట్ మారి పులిలా తిరగబడితే ఎలా ఉంటుంది అన్నట్లుగా ట్రైలర్ ను రూపొందించారు. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. సూపర్ స్టార్ యాక్షన్ కి తగ్గట్టుగా అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. అయితే ట్రైలర్ లో ఒకే ఒక లోటుంది. అదేంటంటే 'కావాలా' సాంగ్ లో చిందేసి సోషల్ మీడియాలో ఆ పాటతో పాటు సినిమా పేరు మారుమోగేలా చేసిన తమన్నా మాత్రం ట్రైలర్ లో కనిపించలేదు.