English | Telugu

'బేబీ' 20 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా!

రీసెంట్ టైమ్స్ లో యూత్ ని పిచ్చెక్కించిన సినిమా 'బేబీ'. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనివాస కుమార్ నాయుడు (ఎస్కేన్) నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతమందించాడు. జూలై 14న జనం ముందు నిలిచిన 'బేబీ' మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని.. వసూళ్ళ పరంగానూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తోంది.

బుధవారం (ఆగస్టు 2)తో 20 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకున్న 'బేబీ'.. 20వ రోజు 60 లక్షల గ్రాస్, 30 లక్షల షేర్ ఆర్జించింది. ఓవరాల్ గా.. 20 రోజులకి గానూ రూ. 35.15 కోట్ల షేర్ (రూ. 63.55 గ్రాస్) రాబట్టింది. మరి.. ఫుల్ రన్ లో 'బేబీ' ఓవరాల్ షేర్ ఎంతకు చేరుకుంటుందో చూడాలి.

తొలి రోజు నుంచి 20వ రోజు వరకు 'బేబీ'కలెక్షన్ వివరాలు:

మొదటి రోజు: 2.60 కోట్ల షేర్
రెండో రోజు: 2.98 కోట్ల షేర్
మూడో రోజు: 3.77 కోట్ల షేర్
నాలుగో రోజు: 3.72 కోట్ల షేర్
ఐదో రోజు: 2.94 కోట్ల షేర్
ఆరో రోజు: 2.45 కోట్ల షేర్
ఏడో రోజు: 2.00 కోట్ల షేర్
ఎనిమిదో రోజు : 1.76 కోట్ల షేర్
తొమ్మిదో రోజు: 2.33 కోట్ల షేర్
పదో రోజు: 3.40 కోట్ల షేర్
పదకొండో రోజు: 1.46 కోట్ల షేర్
పన్నెండో రోజు: 1.21 కోట్ల షేర్
పదమూడో రోజు: 90 లక్షలు
పద్నాలుగో రోజు: 82 లక్షలు
పదిహేనో రోజు : 47 లక్షలు
పదహారో రోజు: 65 లక్షలు
పదిహేడో రోజు : 71 లక్షలు
పద్దెనిమిదో రోజు : 44 లక్షలు
పంతొమ్మిదో రోజు : 34 లక్షలు
ఇరవైవ రోజు: 30 లక్షలు
ఇరవై రోజుల మొత్తం షేర్: రూ. 35.15 కోట్లు

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.