English | Telugu
యూరప్‌లో అజిత్... ఖుషి ఖుషీగా షాలిని!
Updated : Aug 2, 2023
అజిత్ కుమార్ ప్రస్తుతం యూరోప్‌లో ఉన్నారు. గ్రాండ్ వరల్డ్ బైక్ టూర్ ప్లాన్‌లో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య షాలిని షేర్ చేశారు. తన భర్త ఏం చేసినా, పక్కనే చీర్ లేడీగా ఉంటారు షాలిని. ఇప్పుడు బైక్ టూర్ ప్లానింగ్‌లోనూ అజిత్ అభిప్రాయాలకు విలువిచ్చి, ఇష్టానుసారంగా చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. యూనిక్ లైఫ్ స్టైల్‌ని, డిఫరెంట్ చాయిసులని బ్యాలన్స్ చేసుకోవడంలో అజిత్ తర్వాతే ఇంకెవరైనా. లైమ్ లైట్‌కి కంప్లీట్‌గా దూరంగా ఉండాలనుకునే నటుడు అజిత్. షూటింగ్ లేని సమయంలో ఎక్కువగా వరల్డ్ టూర్‌లు వెళ్తుంటారు. ఇప్పుడు యూరప్‌లో ఉన్నారు. ఇంతకు ముందు కూడా అజిత్ చాలా ప్రదేశాలకు బైక్ మీద వెళ్లేవారు. అయితే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఫ్యాన్స్ కి ఆ అప్‌డేట్స్ ఎక్కువగా తెలుస్తున్నాయి. అందులోనూ రీసెంట్ టైమ్స్ లో షాలిని బాగా యాక్టివ్ అయ్యారు.
అజిత్ ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడూ లీక్‌లు ఇస్తున్నారు. థాంక్యూ మేడమ్ అంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. కేవలం అజిత్ కోసం మాత్రమే కాదు, పిల్లలు అనౌష్క, ఆద్విక్ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు షాలిని. జర్మనీ, నార్వే, డెన్మార్క్... వేటు గో అంటూ క్యాప్షన్ పెట్టి రీసెంట్‌గా రిలీజ్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. రైడర్ జాకెట్‌తో ఉన్న అజిత్ స్టన్నింగ్ పిక్స్ మెప్పిస్తున్నాయి. యూరప్ ట్రిప్ కంప్లీట్ కాగానే అజిత్ చెన్నైలో ల్యాండ్ అవుతారు. ఆయన నటించే 62వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. మగిళ్ తిరుమేని డైరక్షన్‌లో వస్తున్న సినిమా ఇది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.