English | Telugu

ఓ ప్లానింగ్.. ఓ పద్ధతి.. ఓ విజన్

'ఓ ప్లానింగ్.. ఓ పద్ధతి.. ఓ విజన్' అనే మాట విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' సినిమాకి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల కాగా, ఒక్కో పాట సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈమధ్య కాలంలో పాటలతో ప్రేక్షకులలోకి ఇంత బలంగా వెళ్లిన సినిమా 'ఖుషి' అని చెప్పొచ్చు. ఈ జోష్ ని కంటిన్యూ చేస్తూ పక్కా ప్లానింగ్ తో 'ఖుషి' టీం అడుగులు వేస్తోంది.

'ఖుషి' విడుదలకు ఇంకా నాలుగు వారాలే సమయముంది. ఇప్పటికే పాటలతో ప్రేక్షకులకు చేరువైన ఖుషి చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు, ఈ నాలుగు వారాల్లో పక్కా ప్రణాళికతో ప్రమోషన్స్ ప్లాన్ చేసింది మూవీ టీం. ఆగస్టు 9న ఖుషి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈమధ్య కాలంలో మ్యూజికల్ నైట్ జరుపుకున్న సినిమాలు అరుదనే చెప్పాలి. వీటితో పాటు ఈ నాలుగు వారాల్లో ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్, టూర్లు అంటూ పలు ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. దీంతో 'ఓ ప్లానింగ్.. ఓ పద్ధతి.. ఓ విజన్' అంటూ విజయ్, సమంత అభిమానులు సంబరపడుతున్నారు.

'లైగర్'తో విజయ్, 'శాకుంతలం'తో సమంత, 'టక్ జగదీష్'తో శివ నిర్వాణ పరాజయాల్లో ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి చేసిన 'ఖుషి'పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఈ ముగ్గురిని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.